వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాగ్ బాంబు: మన సైన్యం ఎక్కువకాలం పోరాడలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో కీలకమైన విషయం వెలుగు చూసింది. మనం సైన్యం ఎక్కువ కాలం పోరాడలేదని నివేదికలో తేలింది. దీర్ఘకాలం పోరాడేందుకు వీలుగా భారత సైన్యం వద్ద సరిపడా మందుగుండు సామాగ్రి లేదని తన తాజా నివేదికలో బాంబు పేల్చింది.

ఈ నిల్వలు 40 రోజులకు సరిపడా ఉండాలి. అయితే భారత సైన్యం వద్ద ఇరవై రోజులకు చాలినంత నిల్వ కూడా పూర్తిస్థాయిలో లేదని కాగ్ పేర్కొంది. పాఇది నేరుగా సైన్యం యుద్ధ సన్నద్ధత పైన ప్రభావం చూపే అంశం. పాకిస్తాన్, చైనాల రూపంలో బలమైన ప్రత్యర్థుల నుండి ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు ఇది ప్రమాద సంకేతమంటున్నారు.

Indian Army in no position to wage a long war, CAG report says ammunition reserves alarmingly low

2012 మార్చిలో నాటి సైన్యాధిపతి జనరల్ వీకే సింగ్ కూడా భారత ప్రభుత్వానికి ఇదే తరహా నివేదిక ఇచ్చారు. అదే విషయాన్ని కాగ్ నిజమని చెప్పింది. 2009 నుండి 2013 వరకు అధ్యయనం చేసి ఈ నివేదికను ఇచ్చింది.

యద్ధ నిలవలు 40 రోజులకు సరిపడా ఉంచాల్సి ఉంది. అయితే 2013 మార్చిలో మొత్తం మందు గుండు సామాగ్రిలో 10 శాతం రకాల్లోనే నిల్వలు ఉన్నాయి. నిల్వలు ఏటేటా తగ్గుతున్నాయి. శతఘ్ని మందుగుండు సామాగ్రిలో 33 శాతం నుంచి 84 శాతం రకాల్లో నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి.

మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల కోసం సైన్యం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కింద ఉన్న పది కర్మాగారాల పైన ఆధారపడుతోంది. మిగతాది దిగుమతి చేసుకుంటోంది. యుద్ధ సామాగ్రిలో లోపాలు కూడా పెద్ద సమస్యగా మారాయి. రూ.3758 కోట్ల విలువైన సామాగ్రిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. రూ.2,109కోట్ల విలువైన సామాగ్రి, మరమ్మత్తుల కోసం ఉంది.

English summary
Indian Army in no position to wage a long war, CAG report says ammunition reserves alarmingly low
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X