ధోనీ గ్రేట్, చూసి బుద్ది తెచ్చుకోవాలి: కపిల్ సంచలనం
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ సారథి కపిల్ దేవ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం తమ కుర్చీలను అట్టిపెట్టుకుని ఉండే క్రీడా పాలకులు మహేంద్ర సింగ్ ధోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. టెస్టుల నుండి సరైన సమయంలో ధోనీ తప్పుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
ఎవరైనా ఆడాలనుకుంటే రెండువందల టెస్టులు కూడా ఆడవచ్చునని చెప్పారు. కానీ ధోనీ మాత్రం అలా చేయలేదన్నారు. తాను చేయగలిగింది చేశా, ఇక తర్వాత తరం ఆడుకోనివ్వండి అంటూ సంకేతాలిస్తూ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడన్నారు. అందుకు తాను ధోనీని అభినందిస్తున్నానని చెప్పారు.

అతనో గొప్ప వ్యక్తి అన్నారు. క్రికెట్‌కు ఎంతో చేశాడన్నారు. ధోనీ కనీసం వందో టేస్టు దాకా ఆడాలని మనమందరం అనుకున్నామని, కాని అతను నూతనంగా ఆలోచించాడన్నారు. జీవితమంతా ఆడుతూనే ఉండాలని ఎవరు అనుకోకూడదన్నారు.
తర్వాత తరం వస్తుందని తెలిశాక రిటైరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కపిల్.. గ్రెగ్ చాపెల్ చేసిన ఓ మాట చెప్పారు. 'ఓ ఆటగాడు తన సమయం దాటిపోయాక కూడా కొనసాగితే.. తర్వాత మూడు తరాలకు నష్టం చేకూర్చినట్లే' అని చాపెల్ అన్నాడన్నారు. ఈ మాటను తాను గౌరవిస్తానని చెప్పారు. క్రికెట్ పాలకులు కూడా 30 ఏళ్లు లేదా జీవితాంతం కుర్చీలకు అతుక్కోవద్దని, ధోనీని చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications