ఎదురుపడిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ: అటు మోడీ

ఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కత్తులు దూసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఓ వేడుకలో పరస్పరం ఎదురు పడ్డారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ మంగళవారంనాడు ఏర్పాటు చేసి ఎట్ హోం కార్యక్రమానికి వారిద్దరు కూడా వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కేజ్రీవాల్ తన సతీమణి సునీత, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో కలిసి ఇన్నోవా కారులో వచ్చారు. చుట్టూ మూగి వారిని అతిథులు ఆహ్వానించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జి నజీబ్ జంగ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ వేడుకలకు వచ్చారు.

Kejriwal and Kiran Bedi Came Face to Face at This Function

ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ తర్వాత వచ్చారు. కాసేపు కేజ్రీవాల్ మోడీ వెనక నడిచారు. ఆ తర్వాత సోఫాకు ఓ చివర కేజ్రీవాల్, మరో చివర మోడీ కూర్చున్నారు. వారిద్దరి మధ్య రాజ్‌నాథ్ సింగ్ కూర్చున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మోడీలతో పలువురు సెల్ఫీలతో ఫొటోలతో తీసుకున్నారు.

కేజ్రీవాల్‌కు పక్కన కుర్చీలో కిరణ్ బేడీ కూర్చున్నారు. ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసిన తర్వాత వారిద్దరు ఎదురుపడడం ఇదే మొదటిసారి. కేజ్రీవాల్‌పై మోడీతో పాటు కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+