వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఎల్ఏని తాళ్లతో కట్టేశారు: సమస్యల తంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

చాందౌలీ: కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను గాలికి వదిలేసి చూడపు చుట్టంగా వచ్చారాని ఆరోపిస్తూ స్థానికులు మండిపడి ఇద్దరు ప్రజా ప్రతినిధులను తాళ్లతో కట్టేసి మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడే, ఇక్కడే తమ సమస్యలు పరిష్కరించాలని పట్టుబట్టారు.

ఉత్తరప్రదేశ్ లోని ముఘాల్ సారాయ్ శాసన సభ నియోజక వర్గం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ ) శాసన సభ్యుడు బబ్బన్ సింగ్ చౌహాన్, స్థానిక ఖౌముద్దిన్ ను స్థానికులు తాళ్లతో కట్టేసి నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి బబ్బన్ సింగ్ చౌహాన్ సిద్దమయ్యారు.

స్థానిక నాయకులను వెంట పెట్టుకుని ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. చాందౌలీ ప్రాంతంలోని మూడవ వార్డులోకి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ఊహించలేని సంఘటన ఎదురైంది. స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో బబ్బన్ సింగ్ చౌహాన్, స్థానిక కౌన్సిలర్ ఖౌముద్దిన్ ను వారు కుర్చున్న కుర్చీలలోనే తాళ్లతో కట్టివేశారు.

MLA Tied Up and Held for 3 Hours by Angry Villagers in Uttar Pradesh

తమ గ్రామానికి రూ.80 లక్షల నిధులు మంజూరు అయ్యాయని గతంలో మీరే చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పని ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. ఈ ప్రాంతంలో తాగునీరు సౌకర్యం లేదని, విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పినా పట్టించుకోలేదిని మండిపడ్డారు.

ఎంఎల్ఏని వదిలి పెట్టడానికి నిరాకరించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మునిరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో చర్చించి ఎంఎల్ఏ, కౌన్సిలర్ ను విడిపించారు. తనను నిర్బంధించారని ఎంఎల్ఏ బబ్బన్ సింగ్ చౌహాన్ ఫిర్యాదు చెయ్యలేదని ఎస్పీ మునిరాజ్ తెలిపారు.

English summary
A group of angry villagers in Uttar Pradesh's Alinagar area, who were protesting against erratic supply of electricity and water, tied up and held a Bahujan Samaj Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X