కుక్కలుకూడా: యోగాపై ఏచూరి,అన్సారీని పిలవలేదు
భువనేశ్వర్: ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో, ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 191 దేశాలు నిర్వహించాయి. అయితే, దీని పైన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యోగా దినోత్సవంపై మండిపడ్డారు. భారీ సంఖ్యలో జనాలను చేర్చడం కేవలం నియంతలు మాత్రమే చేసే పని అన్నారు. రాజ్‌పథ్‌లో పెద్ద ఎత్తున జనం గుమికూడటం నిషేధమని, అయినప్పటికీ వేల సంఖ్యలో జనాన్ని సమీకరించారని ఆగ్రహించారు.

కుక్కలు కూడా కాళ్లు చేతులు ఆడిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటాయని, యోగాకు సంబంధించిన అన్ని ఆసనాలు దానిలో చూడవచ్చునని చెప్పారు. శరీరంలోని కణాలకు సరైన విధంగా ఆక్సిజన్ అందితే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. మోడీ హిందుత్వ అజెండాను అమలు చేస్తున్నారన్నారు.
ఉపరాష్ట్రపతి గైర్హాజరును ప్రశ్నించిన రామ్ మాధవ్
యోగా నదినోత్సవం రోజు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ గైర్హాజరుకావడాన్ని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. అనంతరం ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు స్పందించాయి. ఉపరాష్ట్రపతికి యోగా కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications