పాపులారిటీ కోసం నిప్పులతో తలస్నానం (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: టెక్నాలజీ వాడకంలో ఇంటర్నెట్ నిజంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వాడుకులోకి వచ్చిన సోషల్ మీడియా ప్రంపంచలో జరుగుతున్న వింత సంఘటనలను మన కళ్లకు ముందు ఆవిష్కృతం చేస్తోంది. ముఖ్యమంగా సోషల్ మీడియాలో చాలా మంది పాపులారిటీ సంపాదించాలని తహతహలాడుతుంటారు.

అందుకోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ట్విట్టర్ లాంటి వాటిల్లో అభిమానులను అలరించేందుకు హాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు వారి నగ్న చిత్రాలు పెట్టడం ఇప్పటి వరకు మనం చూశాం. అయితే తాజాగా చైనాలో ఓ వ్యక్తి నిప్పులతో స్నానం చేస్తూ ఓ వీడియోని తీసుకున్నాడు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఓ వైరల్‌‌‌లా మారింది. వీడియోలో ఉన్న వ్యక్తి బాత్‌రూమ్‌లోకి వచ్చి తలస్నానం చేసేందుకు షాంపూ రాసుకున్నాడు. అయితే షవర్ ఆన్ చేయకుండా ఓ అగ్గిపెట్టె తీసుకుని ఓ చిచ్చుబుడ్డి లాంటిదాన్ని అంటించాడు. వెంటనే దాని నుంచి ఓ పెద్ద మంట అతడిపైకి రావడం జరిగింది.

Bizarre moment man takes shower under lit FIREWORK in shocking prank

దాని కింద నిల్చుని మంటతో తలని రుద్దుకున్నాడు. మంటలు ఒక్కసారిగా పెద్దవవడంతో పక్కకు తప్పుకున్నాడు. అనంతరం మళ్లీ ఆ నిప్పులు కిందకు వచ్చి స్నానం చేశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ ఘటనలో ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This is the unbelievable moment a man took a shower with a lit firework. The shocking clip is believed to have been filmed somewhere in China and was shared widely online. Social media users are at a loss to explain why anyone would do such a thing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X