రూ. 1.38 లక్షలతో చీరెను కొన్న సిఎం

బెంగళూరు: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు గానీ ముఖ్యమంత్రి తలుచుకుంటే చీరలు కూడా కొనవచ్చునని నిరూపించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రూ.1.38 లక్షల విలువ చేసే చీరెను కొని ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

మంగళవారంనాడు దావణగెరెలోని మహానగర పాలికె పరిధిలో కొత్తగా నిర్మించిన వ్యాపార భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మైసూరు పట్టుచీరెల వస్త్ర దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ప్రదర్సించిన చీరెలను పరిశీలిస్తూ వెళ్లారు.

CM Siddaramaiah buys Rs 1.38 lakhs value saree

ఆయన కంటికి ఓ చీరె నచ్చింది. అంతే, ఆలస్యం చేయకుండా దాన్ని కొనేశారు. ఉబ్బి తబ్బిబ్బు కావడం అక్కడివారి వంతైంది. కొద్ది రోజుల క్రితం బళ్లారి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ రమేష్ చెంప చెళ్లుమనిపించి ఆయన పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు చీర కొని అందరి దృష్టినీ ఆకర్షించారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా హైదరాబాదులో మంగళవారం షాపింగ్ చేసి వంద దస్తులు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఇది కూడా నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+