షాకింగ్: చితిపై లేచి కూర్చుంది, ఇంటికెళ్లాక మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.95 ఏళ్ల ఓ వృద్ధురాలు చితి పైనుంచి లేవడం అక్కడ ఉన్న వారినందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ షియోపూర్‌లోని కుంభర్ మొహల్లా బుధవారం ఉదయం జరిగింది. ఆ మహిళ పేరు హీరాబాయ్.
హీరాబాయ్ చనిపోయిందనుకుని కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత పాడె మీద తీసుకు వెళ్లారు. చితిమీద పడుకోబెట్టి కుటుంబ సభ్యులు నిప్పు అంటించబోయారు. అంతలోనే ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది.

చితికి నిప్పంటించబోతుండగా ఆమె ఉన్నట్టుండి ఆమె లేచి కూర్చుంది. ఈ పరిణామానికి అక్కడి వారంతా నివ్వెరబోయారు. ఆమెకు ఏమీ కాలేదు అదే చాలనుకుని ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికెళ్లిన కొద్దిసేపటికే తనకు అస్వస్థతగా ఉందంటూ ఆమె అక్కడే చనిపోయింది. దాదాపు పదిహేను రోజులుగా ఏమీ తినలేదని దీంతో నీరసించి గుండె ఆగి చనిపోయి ఉంటుందని హీరాబాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications