డిగ్గీరాజా ఆస్తి మొత్తం మొదటి భార్య కొడుక్కే!: రెండో భార్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో మరో ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఆయనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు రాజకీయవేత్తగా ఆయన సంబంధించిన ఆస్తి మొత్తం తన మొదటి భార్య కుమారుడికే చెందుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు ఈ నిర్ణయం తానొక్కడినే తీసుకోలేదని, తన రెండో భార్య అమృతా రాయే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పడం విశేషం. వివరాల్లోకి వెళితే... రాజ్యసభ టీవీలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న అమృతా రాయ్‌తో ప్రేమలో పడ్డ ఆయన రెండేళ్ల క్రితం ఆమెను వివాహం కూడా చేసుకున్నారు.

Digvijay Singh's wife Amrita Rai gives up her claim on his property

అమృతా రాయ్‌తో తన సంబంధాన్ని ఏప్రిల్ 2014లో ఆయన బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అమృతా రాయ్ సైతం ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో ధ్రువీకరించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. కాగా దిగ్విజయ్ సింగ్‌కు మొదటి భార్య ద్వారా జయవర్ధన్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.

ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్‌కు ఆయన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు రాజకీయ వేత్తగా ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుందని ఏ ఒక్కరూ ఆయన్ను ప్రశ్నించలేదు. అయినప్పటికీ ఆయన తన ఆస్తి మొత్తం మొదటి భార్య కుమారుడు జయవర్ధన్ సింగ్‌కే చెందుతుందని చెప్పేశారు.

తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు తాను సంపాదించిన ఆస్తి మొత్తం తన కుమారుడు జయవర్ధన్ సింగ్ కే చెందుతుందని ఆయన ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదని చెప్పిన దిగ్విజయ్ సింగ్, తన రెండో భార్య అమృతా రాయే ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Digvijay Singh has announced that his wife Amrita Rai, who is a journalist by profession, has foregone her right on his ancestral and self-earned property in the favour of his son Jaivardhan Singh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి