ఇంత భారీగానా?: హైదరాబాదీతోనే గాలి కూతురు పెళ్లి
బెంగళూరు: మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిపై కూతురు పెళ్లిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూతురు పెళ్లి శుభలేఖను ఎల్ఈడీ స్క్రీన్ తో రూపొందించి సంచలనం సృష్టించిన గాలి.. ఇప్పుడు పెళ్లి కూడా అంత ఘనంగా జరిపే ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది.
'గాలి కూతురు పెళ్లి ఆర్భాటంగా కాదు! సింపుల్ గానేనట'
తన కూతురు 11 పెళ్లిరోజుల వేడుకలకు భారీగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎవరు కనీవినీ ఎరుగుని రీతిలో గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లికి రూ. 550కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. ఇటీవలే కూతురు ఎంగేజ్‌మెంట్ ఘనంగా పూర్తి చేసిన గాలి జనార్థన్ రెడ్డి.. పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా వినూత్న రీతిలో డిజైన్ చేయించిన విషయం తెలిసిందే.

దాదాపు దేశంలోని ప్రముఖ వ్యక్తులందర్నీ తన కూతురు పెళ్లికి ఆహ్వానించారు గాలి. సినీ, రాజకీయ, పారిశ్రామికులు ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యే కఅవకాశం ఉంది. గాలి కూతురు పెళ్లి శుభలేఖను డైలాగ్ కింగ్ సాయికుమార్ రూపొందించారు.
కాగా, నవంబర్ 16న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రం దేవారారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డితో గాలి కూతురు బ్రాహ్మణి వివాహం జరుగనుంది.












Click it and Unblock the Notifications