లక్ష్మీపార్వతి శపథం: చంద్రబాబు పోయేంత వరకు...

నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎన్టీ రామారావు సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతికి పీకల దాకా కోపం ఉన్న విషయం కొత్తదేమీ కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె తన ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు. తాజాగా, కృష్ణా పుష్కరాలు కూడా ఆమెకు చంద్రబాబుపై తన శత్రుత్వాన్ని వ్యక్తం చేయడానికి పనికి వచ్చాయి.

చంద్రబాబునాయుడు ఉన్నంత కాలం తాను ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యస్నానాలు ఆచరించనని లక్ష్మీపార్వతి చెప్పారు. శుక్రవారం ఆమె తెలంగాణలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగల్ పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానం చేశారు.

Lakshmi Parvathi will not dip in AP in Krishna, why?

ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనకు మొదటి నుండి తెలంగాణ అంటే ఎంతో అభిమానమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నంత కాలం తాను ఎపిలో పుణ్యస్నానాలను ఆచరించవద్దని నిర్ణయించుకున్నందునే గోదావరి పుష్కరాల్లో సైతం భద్రాచలంలో గోదావరి స్నానం ఆచరించానని చెప్పారు.

చందంపేట మండలం పెద్దమునిగల్ వద్ద ప్రశాంత వాతావరణం ఉంటుందన్న సమాచారం తోనే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. తన సోదరితో తాను పెద్దమునిగల్ వచ్చినట్లు చెప్పారు. లక్ష్మీపార్వతితో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు మహిళా ఉద్యోగినులు ఆసక్తి కనబర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+