మొగుడు పళ్లెం తిరగేసి కొడితేనే వంట: ఏపీ మంత్రి

రాజమహేంద్రవరం: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొగుడు, పెళ్లాల విషయమై ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు.

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ... మొగుడు పళ్లెం తిరగేసి కొడితేనే పెళ్లాం వంట చేసి పెడుతుందని, మనం ప్రాధేయపడే స్థాయి నుంచి భయపెట్టే స్థాయికి ఎదగాలన్నారు.

ఇంతలో ఓ మహిళా నేత ఖండించబోయారు. వెంటనే మాణిక్యాల రావు మాట్లాడుతూ.. పెళ్లాం గరిటె తిరగేసినా మొగుడు భయపడతాడని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Minister Manikyala Rao interesting comments

కాగా, రాజమహేంద్రవరంలోని లాహాస్పిన్ హోటల్లో బిజెపి కోర్ కమిటీ భేటీ అయింది. మార్చి 6వ తేదన రాజమహేంద్రవరంలో నిర్వహించే బహిరంగ సభ తర్వాత ఇటు ప్రభత్వంలో, అటు అధికారుల ఆలోచనలో మార్పు వస్తుందని చెప్పారు.

బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఇటీవల పళ్లెం - గరిటె భలే సత్తా చాటాయన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కాపులు పల్లెం, గరిటెతో శబ్దం చేసి నిరనసలు తెలిపారు. దీనిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+