పాక్‌కు బుద్ధి వచ్చేలా మోడీ ఏం చేయట్లేదు, కానీ!

న్యూఢిల్లీ: సంపూర్ణ మెజారిటీతో 2014లో ఢిల్లీ పీఠం ఎక్కిన ప్రధాని నరేంద్ర మోడీ 'పాకిస్తాన్ పాలసీ' పైన ఎక్కువ శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు ఓ అమెరికన్ సర్వేలో వెల్లడయింది. పాకిస్తాన్ పైన ఉండాల్సిన దూకుడు లేదని చాలామంది అభిప్రాయపడినట్లు సర్వేలో వెల్లడయింది.

భారత్ పైన నిత్యం దాడికి దిగుతున్న పాకిస్థాన్ పైన ప్రధాని మోడీ అవలంబిస్తున్న విధానం పట్ల అత్యధిక భారతీయులు అసంతృప్తితో ఉన్నారని తమ సర్వేలో వెల్లడయిందని సదరు అమెరికన్ సంస్థ పేర్కొంది. పాకిస్థాన్‌కు బుద్ధి వచ్చేలా మోజీ ఏమీ చేయట్లేదని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో గాంధీల పాలనతో పోలిస్తే ప్రధానిగా నరేంద్ర మోడీ సమర్థుడని ప్రజలు అభిప్రాయపడుతున్నారని ప్యూ సర్వే పేర్కొంది. తమ సర్వేలో భాగంగా మొత్తం 2,464 మందిని ప్రశ్నించామని పేర్కొంది.

Most Indians disappointed with Narendra Modi's Pakistan policy: survey

భారత్‌లో నేరాల సంఖ్య పెరగడం అతిపెద్ద సమస్యని 82 శాతం మంది చెప్పారని, ఉద్యోగావకాశాలు లభించడం లేదని 81 శాతం, అధికారుల్లో అవినీతి పేరుకుందని 80 శాతం, ఉగ్రవాదం పెను సమస్యేనని 78 శాతం మంది చెప్పారని పేర్కొంది.

అమెరికాతో ప్రధాని మోడీ స్నేహబంధం పట్ల 54 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో ప్రధాని మోడీ వైఖరి అసంతృప్తిగా ఉందని 50 శాతం మంది, బాగుందని 22 శాతం మంది, ఇప్పుడే చెప్పలేమని 28 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇక దేశాన్ని నడిపించే నేతగా తొలి ఛాయిస్ మోడీయేనని 81 శాతం మంది, సెకండ్ ఆప్షన్‌గా సోనియా (65 శాతం), ఆపై రాహుల్ గాంధీ (63 శాతం మంది)ను సర్వేలో పాల్గొన్న వారు ఎంచుకున్నారని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+