ముద్రగడ కొత్త పాయింట్, 'రూ.లక్ష కోట్ల' జగన్‌కి అస్త్రం

విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ధీటుగా స్పందించారు. చంద్రబాబు రెండెకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారని ముద్రగడ ప్రశ్నించారు.

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 'నీకిది - నాకది' పద్ధతిలో అతను పెద్ద మొత్తంలో దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు.

ఇందుకు వారు ఆయన పైన వేసిన ఛార్జీషీట్లు, సిబిఐ, ఈడీ దర్యాఫ్తులను ఆధారంగా చూపిస్తున్నారు. అయితే, కేసు విచారణలో ఉందని, ప్రస్తుతం జగన్ నిందుతుడు మాత్రమేనని, నేరస్తుడు కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

Mudragada hot comments on Chandrababu's assets

అయితే, జగన్ రూ.లక్ష కోట్లకు ఇప్పుడు ముద్రగడ వైసిపికి చంద్రబాబుపై రూ.2 లక్షల కోట్ల ఆయుధాన్ని ఇచ్చారు. చంద్రబాబు రెండు ఎకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక వైయస్ జగన్ కూడా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.

జగన్ పైన రూ.లక్ష కోట్ల ఆరోపణలు చేస్తున్నందున రూ.2 లక్షల కోట్లతో చంద్రబాబుపై కౌంటర్‌గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు తన ఆస్తుల విషయంలో పారదర్శకత పాటిస్తున్నారని చినరాజప్ప చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+