వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టులకు సపర్యలు చేస్తున్న పోలీసులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖఫట్టణం:పాము ముంగిస చిరకాల ప్రత్యర్థులు, పిల్లి ఎలుక కూడ అంతే.....పోలీసులు మావోయిస్టులు ఎదురు పడితే ఎవరో ఒకరు చనిపోవాల్సిందే.కాని, అందుకు భిన్నంగా విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది ఘటన. ఎన్ కౌంటర్ లోగాయపడిన మావోలకు పోలీసులు పపర్యలు చేస్తుండడం విశేషం. ఎన్ కౌంటర్ లో గాయపడిన మావోలకు గ్రేహౌండ్స్ పోలీసులు రక్తదానం చేశారు.

ఒడిశా ఎన్ కౌంటర్ లో 24 మంది మావోలు మరణించారు.ఈ ఎన్ కౌంటర్ కు ముందే విశాఖ జిల్లా ఏజెన్సీలో పెదపాడు, కుంకుమపూడిలో పోలీసులకు, మావోయిస్టులకు మద్య కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో గాలికొండ దళ సభ్యులు జి నర్సింగ్, ముప్పల అబ్బులు అలియాస్ అంబ్రి లకు గాయాలయ్యాయి. మిగిలినవారు తప్పించుకొన్నారు.

police behave like a friend with maoists

గాయపడిన మావోయిస్టులను పోలీసులు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స చేయిస్తున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు మావోయిస్టులకు చికిత్సను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.బుల్లెట్ గాయాలైన నర్సింగ్, అంబ్రిలకు కెజిహెచ్ వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.

మావోల ఆపరేషన్ కు లవసరమైన రక్తాన్ని కానిస్టేబుల్స్ రామానాయుడు, శ్రీనివాసరావులు ఇచ్చారు.వీరిద్దరికి ఆర్ధోపెడిక్ డాక్రర్ ధర్మారావు ఆపరేషన్ నిర్వహించారు.కెజిహెచ్ ట్రామా కేర్ సెంటర్ లో కట్టుదిట్టమైన రక్షణ మద్య మావోలను ఉంచారు.గాయపడిన మావోలకు పోలీసులే దగ్గరుండి అల్పాహారంతో పాటు భోజనాన్ని తినిపిస్తున్నారు.

English summary
police, maoist are looking like a friends, is it true , yes this is true. this incident happened in vishakapatnam district. who was injured in an encounter recently in vishakapatnam dist at kukumpudi.police were blood donate who was injured in an encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X