వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజినీకాంత్ వర్సెస్‌ జయలలిత: అప్పుడలా.. ఆ తర్వాతిలా!

ప్రముఖ సినీనటి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత.. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య మొదట కొంత వ్యతిరేక భావనలు ఉండేవి. అయితే, ఆ తర్వాత అదంతా మారిపోయింది. తొలినాళ్లలో జయను వ్యతిరేకించిన రజినీకాంత్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ సినీనటి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత.. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య మొదట కొంత వ్యతిరేక భావనలు ఉండేవి. అయితే, ఆ తర్వాత అదంతా మారిపోయింది. తొలినాళ్లలో జయను వ్యతిరేకించిన రజినీకాంత్.. ఆ తర్వాత కాలంలో ఆమెకు మద్దతునివ్వడం మొదలుపెట్టారు. ఇలా ఆమెపై రజినీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

1996లో 'జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు' అని రజినీకాంత్.. చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్య ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయ ప్రత్యర్థుల సోలో నినాదంగా మారిపోయింది. అయితే, అదే రజనీకాంత్ 2011లో 'జయలలిత విజయం తమిళనాడును కాపాడింది' అని ప్రకటించడం గమనార్హం.

కాగా, వీరిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. చెన్నైకు చెందిన గాయత్రీ శ్రీకాంత అనే నేత్రవైద్య నిపుణురాలు 'ద నేమ్‌ ఈజ్‌ రజనీకాంత్' అనే పుస్తకంలో దాని గురించి వివరించారు. ఆ కథనం ఏమిటంటే.. ఒకసారి రజనీకాంత్ తన కారులో వెళ్తుండగా ట్రాఫిక్‌ ఆగిపోయింది.

rajinikanth vs Jayalalitha

ఎందుకు ట్రాఫిక్‌ ఆగిందని రజనీకాంత్ ప్రశ్నించగా.. సీఎం జయలలిత ఆ దారిలో వస్తున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌ ఆపేశారని అక్కడున్న ట్రాఫిక్‌ పోలీస్‌ చెప్పాడు. ఆమె ఎంతసేపట్లో వస్తారని రజనీ ప్రశ్నించగా.. తెలియదని, బహుశా అరగంటలో రావచ్చని అతడు సమాధానమిచ్చాడు.

మరి అప్పటిదాకా ట్రాఫిక్‌ను పంపించవచ్చుగా అని రజనీ అడిగితే.. ట్రాఫిక్‌ నిలిపివేయాలని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని అతడు చెప్పాడు. దీంతో రజనీ ఒక్క క్షణం ఆలోచించి.. కారులోంచి దిగి సమీపంలో ఉన్న బడ్డీకొట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్‌ కొని వెలిగించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని సిగరేట్ తాపీగా తాగడం మొదలుపెట్టారు.

అసలే తమిళనాడులో రజినీకి ఉన్న కేజ్రీ అంతాఇంతా కాదు. ఏకంగా తమ వీధుల్లోకి వచ్చేసరికి ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. క్షణాల్లో అక్కడ వేలాది మంది గుమిగూడారు. దీంతో ఆ దారిలో వస్తున్న జయలలిత ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుపోయారు. ఇలా గతంలో జయను కొంత వ్యతిరేకించిన రజనీకాంత్.. తర్వాత కాలంలో ఆమెకు మద్దతుగా నిలిచారు.

English summary
Superstar Rajinikanth has opposed Jayalalitha in first.. after some time he supported her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X