షాకింగ్: అమ్మాయి రేప్, 1200 కిలోల గోధుమల జరిమానా
లాహోర్: పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఉమర్ కోట్ జిల్లాలో గులాంనబీషా ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుల పైన కేసు పెట్టారు.
పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో అతడు బాలిక తండ్రితో సమస్యను జిర్గా (గ్రామ పెద్దల సమక్షం)లో పరిష్కరించుకుందామని ప్రతిపాదించాడు. ఆయన అగీకరించడంతో పోలీస్ స్టేషన్ నుంచి తగవు గ్రామ పెద్దల వద్దకు వెళ్లింది.

ఘటనను విచారించిన పెద్దలు.. నిందితులను బాధితురాలికి 1,200 కేజీల గోధుమలు చెల్లించాలని ఆదేశించారు. ఇక మీదట పోలీస్ స్టేషన్‌కు వెళ్లవద్దని, తీర్పును వ్యతిరేకిస్తే గ్రామబహిష్కరణ శిక్ష విధిస్తామని హెచ్చరించింది. దీంతో బాలిక తండ్రి దీనిని వ్యతిరేకించాడు.
అయితే, దీనిని మీడియా ప్రచారం చేసింది. దీంతో తీర్పు పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన పోలీసు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. జిర్గా (గ్రామ పెద్దల) ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారన్న విషయం తమకు తెలియదని, నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications