అమ్మ కుడిచేతికి ఏమైంది: పత్రాలపై వేలిముద్రలు

చెన్నై: అమ్మ జయలలిత కుడిచేతికి ఏమైందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న సమయం. పత్రాలపై ఆమె సంతకం చేయకుండా వేలి ముద్రలు వేయడం ఈ ఉత్కంఠకు కారణమైంది. తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం శానససభా స్థానానికి నవంబర్ 9వ తేదీన ఉప ఎన్నిక జరగుతోంది.

అధికార అన్నాడియంకె తరఫున్న ఎకె బోస్ అనే అభ్యర్థి పోటీ చేయనున్నారు. అయితే, ఆయనకు చెందిన సంబంధిత పత్రాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జయలలిత సంతకం అవసరమైంది. దీంతో వైద్యులు ఆమె చేత సంతకం చేయించడానికి వేలిముద్రలు తీసుకున్నారు.

Right Hand Inflamed, Jayalalithaa Signs-Off Poll Papers With Thumb Print

అమ్మ వేలి ముద్రలు వేిసన పత్రాలను పార్టీ నాయకులు మీడియాకు కూడా చూపించారు. దీంతో అమ్మ చేతికి ఏమైందనే ప్రశ్న ఉదయిస్తోంది. దాదాపు 40 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు సంబందించిన హెల్త్ బులిటెన్ వారం రోజుల కింద విడుదల చేశారు. ఆమె కోలుకుంటోందని చెప్పారు.

బోస్‌ను అన్నాడియంకె అధికార పార్టీ అభ్యర్థిగా చెబుతూ ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించిన లేఖలో ఐదు చోట్ల జయలలిత వేలి ముద్రలు ఉన్నాయి. మద్రాసు వైద్య కళాశాల మినిమల్ యాక్సెస్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పి. బాలాజీ ఆ వేలి ముద్రలను ధ్రువీకరించారు.

సంతకం చేసిన వ్యక్తి కుడిచేయి పని చేయడం లేదని, దాంతో సంతకం చేయలేకపోయారని, దానివల్ల ఆమె తన సమక్షంలో ఎడమ చేయి వేలి ముద్రలు వేశారని ఆయన ఓ నోట్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+