ఎన్నికల కోసమే విశాఖపై బాబు ప్రేమ ఒలకబోస్తున్నారా! (ఫోటోలు)
విశాఖపట్నం : ఈమధ్య కాలంలో తరుచూ విశాఖ పర్యటనలు.. సందర్బం వచ్చిన ప్రతీసారి విశాఖపై ప్రశంసలు.. ఇవన్నీ చూస్తోంటే ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో రాబోయే కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇలా విశాఖపై ప్రేమను ఒలకబోస్తున్నారు అనేవారు లేకపోలేదు.

వారంలో రెండు రోజులు :
మొన్నీమధ్యే డిటలైజేషన్ సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. దేశంలో విశాఖ లాంటి నగరం మరొకటి లేదని అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు పూర్తిగా మకాం మార్చేశాక విశాఖ పర్యటనలపై కూడా బాగానే ఫోకస్ చేశారు చంద్రబాబు. ఈ క్రమంలోనే వారంలో రెండు రోజులైనా విశాఖ పర్యటనకు వచ్చి వెళ్తున్నారు.

రాకపోకలు పెంచింది అందుకేనా?
విస్తీర్ణం పరంగాను పెద్ద నగరమవడం, పైగా నౌకాశ్రయం నావికా దళం వంటి అదనపు సౌకర్యాలు విశాఖకు కలిసిరావడంతో విశాఖను మరింతగా అభివ్రుద్ది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడం పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశమేది కాదు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీకి ఒకింత గట్టి పట్టు ఉన్నందు వల్ల.. రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీని నిలువరించాలంటే.. స్థానికంగా చంద్రబాబు చేయబోయే అభివృద్ది ప్రస్తావన జనం నోళ్లలో నానేలా చేయాలి. అందుకే తరుచూ ఈవెంట్లు పేరిట చంద్రబాబు విశాఖకు రాకపోకలు పెంచారన్న వాదన వినిపిస్తోంది.

ఈవెంట్ సిటీగా విశాఖ :
అంతర్జాతీయ నౌకా విన్యాసాల ఈవెంట్ తో పాటు, సముద్ర ఆహార ఉత్పత్తుల సమ్మేళనం
సిఐఐ సమావేశం, డిటిజిటైలేజేషన్ లాంటి ఈవెంట్లు ఈమధ్య కాలంలో విశాఖలో జరిగాయి. ఇందుకోసం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ భారీగానే నిధులను ఖర్చు చేసింది. వీటికి తోడు పలు సినీ ఈవెంట్లు, ప్రభుత్వ ఈవెంట్లు కూడా విశాఖలో జరుగుతూ వస్తున్నాయి. దీంతో విశాఖను ఈవెంట్స్ సిటీగా మార్చాలనే యోచనలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆవిధంగా విశాఖపై తమ ప్రేమను చాటుకుని రాబోయే రోజుల్లో పొలిటికల్ గా బలపడాలనేది చంద్రబాబు ఆలోచన అయి ఉండవచ్చు.

మరి వీటి సంగతేంటి?
పైన చెప్పుకున్నవాటన్నింటి సంగతి పక్కనబెడితే.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా విశాఖకు ఐటీ పెట్టుబడులు తీసుకురాకపోవడం, రైల్వే జోన్ పై ఎలాంటి ప్రకటన రాకపోవడం వంటివి విశాఖవాసులను అసంత్రుప్తికి గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ అంశాలు మింగుడుపడడం లేదు. ఇకపోతే హుద్ హుద్ తుఫాను బాధితులకు అందాల్సిన పరిహారం కూడా నేటికి వారి చేతుల్లోకి రాకపోవడం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేదిగా తయారైంది. మరి విశాఖపై తనకున్న ప్రేమను కేవలం ఎన్నికలకు పరిమితం చేస్తారా..? లేక నిజంగానే చంద్రబాబు విశాఖను ది బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతారా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications