వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఆర్థిక మంత్రిగా ఆనం: రాజ్యసభకు యనమల?

సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మారనున్నదా? అంటే అవుననే అంటున్నాయి అధికార టీడీపీ వర్గాలు. అన్ని జిల్లాలకు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్య

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మారనున్నదా? అంటే అవుననే అంటున్నాయి అధికార టీడీపీ వర్గాలు. అన్ని జిల్లాలకు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచారార్భాటం చేయడంలో టీడీపీ తర్వాతే మిగతా ఏ పార్టీ అయినా ముందుంటుందన్నది నిష్ఠూర సత్యం. అలాగే అన్ని జిల్లాల్లోనూ పార్టీ పట్టును కాపాడుకోవాలంటే ప్రస్తుతం ఉన్న క్యాడర్‌తోపాటు 2014 తర్వాత పార్టీలో చేరిన వారి క్యాడర్ సేవలు వినియోగించుకోవాలని, తద్వారా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలన్నది తెలుగుదేశాధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని చెప్తున్నారు.
అందులో భాగంగా ఎన్ని'కల'ల క్యాబినెట్ ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆ క్యాబినెట్‌లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చివరి ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన ఆనం రామ నారాయణరెడ్డికి చోటు దక్కనున్నదని ఆ వార్తా కథనాల సారాంశం.

ఎమ్మెల్సీగా రామ నారాయణరెడ్డికి చోటు కల్పిస్తారా?

ఎమ్మెల్సీగా రామ నారాయణరెడ్డికి చోటు కల్పిస్తారా?

ఇప్పటికిప్పుడు ఆనం రామ నారాయణ రెడ్డి రెండు సభల్లో (అసెంబ్లీ, శాసనమండలి)నూ సభ్యుడు కాదు. మంత్రిగా ప్రమాణం చేస్తే ఆరు నెలల్లో రెండింటిలో ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు కనుక ఎమ్మెల్సీగా రామనారాయణ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా అంతటా ‘ఆనం' కుటుంబానికి గల పలుకుబడిని టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలంటే రామ నారాయణ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి.

యనమల, నారాయణల్లో ఒకరికి ఉద్వాసన?

యనమల, నారాయణల్లో ఒకరికి ఉద్వాసన?

క్యాబినెట్‌లోకి తీసుకుంటే ఆయనకు ఆర్థిక శాఖను కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆనం రామ నారాయణరెడ్డికి కీలక పదవి అప్పగించినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఆనం రామ నారాయణ రెడ్డికి ఆర్థికశాఖ కేటాయిస్తే, ఇప్పటివరకు ఆ శాఖ నిర్వహించిన యనమల రామక్రుష్ణుడిని వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాజ్యసభకు పంపి.. తదుపరి యనమల స్థానే ఎమ్మెల్సీగా రామ నారాయణ రెడ్డిని నియమించాలని టీడీపీ అధి నాయకత్వం ఎత్తుగడ అని భావిస్తున్నారు.

క్యాపిటల్ నిర్మాణంపై ఇక ఫోకస్

క్యాపిటల్ నిర్మాణంపై ఇక ఫోకస్

అయితే యనమల రామక్రుష్ణుడు మంత్రిగా వైదొలిగేందుకు సిద్ధంగా లేకపోతే పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి ఎం నారాయణను క్యాబినెట్ నుంచి తప్పించి.. దాంతో సమానమైన పోస్టు.. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చైర్మన్ గా నారాయణను నియమించే ప్రపతిపాదన పరిశీలనలో ఉన్నట్లు అధికార టీడీపీ వర్గాల కథనం. తద్వారా వచ్చే రెండేళ్ల పాటు రాజధాని నిర్మాణంపైనే నారాయణ పూర్తిస్థాయి ద్రుష్టి సారించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోనున్నారని సమాచారం.

ఎన్టీఆర్ క్యాబినెట్‌లో తొలిసారి ఆనం మంత్రిగా బాధ్యతలు

ఎన్టీఆర్ క్యాబినెట్‌లో తొలిసారి ఆనం మంత్రిగా బాధ్యతలు

ఇదంతా వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే జరిగే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో ఆనం రామ నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే అది రెండోసారి అవుతుంది. రాపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 1985లో గెలుపొందిన ఆనం రామ నారాయణ రెడ్డి నాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మారిన పరిస్థితుల్లో 1991లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్న ఆనం రామ నారాయణ రెడ్డి 2007లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2013లో కిరణ్‌కు ప్రత్యామ్నాయంగా ఇలా సిద్ధం

2013లో కిరణ్‌కు ప్రత్యామ్నాయంగా ఇలా సిద్ధం

2009లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రిగా.. బాధ్యతలు స్వీకరించిన ఆనం రామ నారాయణ రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాద్యతలు చేపట్టారు. అంతేకాదు ‘హస్తిన'లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో నేరుగా సంప్రదించగల చనువు ఉన్న నాయకుడిగా రామ నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి ఉన్నారు. 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అందుకు నిరసనగా సీఎం పదవి నుంచి వైదొలిగితే.. ఆయనకు ప్రత్యామ్నాయ నేతగా ఆనం రామ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కానీ అనుకున్నది ఒకటి దైవం తలిచింది మరొకటి.

చివరి వరకు పార్టీలోనే ఉంటూ ఆనం ఓటమి పాలు

చివరి వరకు పార్టీలోనే ఉంటూ ఆనం ఓటమి పాలు

ఉమ్మడి రాష్ట్ర సీఎంగానే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ చర్యలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో పార్టీకి ప్రతికూల అభిప్రాయం కలిగించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని రోజుల ముందు మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి, సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. కానీ ఆనం రామ నారాయణ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎన్నికల్లో ఓటమి పాలవుతామని తెలిసినా పోటీ చేశారు. పరాజయాన్ని చవి చూశారు.

రామ నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీగా చోటు కల్పిస్తామని ఇలా ఆశలు?

రామ నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీగా చోటు కల్పిస్తామని ఇలా ఆశలు?

2014 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత క్రమంగా ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి దగ్గరయ్యారు. నాడు టీడీపీలో చేరినప్పుడే ఆనం రామ నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని అధి నాయకత్వం ఇచ్చిన హామీ వివిధ కారణాల రీత్యా అమలుకు నోచుకోలేదు. వివిధ సందర్భాల్లో టీడీపీలో చేరికపై పొరపాటు చేశామని ఆనం వివేకానంద రెడ్డి పశ్చాత్తాప పడుతున్నట్లు మీడియా సాక్షిగానే తమ మనో వేదన బయట పెట్టారు. మళ్లీ ఆర్థికశాఖ మంత్రిగా యనమల రామక్రుష్ణుడి స్థానే ఆనం రామ నారాయణ రెడ్డి క్యాబినెట్ లో చోటు దక్కించుకుంటారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే వచ్చే రజాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగే వరకు వేచి ఉండాల్సిందే సుమా!!

English summary
With elections just two years away, Andhra Pradesh Chief Minister and TDP Supremo Chandrababu Naidu is keen on making yet another minor cabinet shuffle. Party general secretary Anam Ramnarayan Reddy is likely to be inducted, and be given a key portfolio in Naidu’s team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X