షాకింగ్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి భార్యతో ట్రంప్ ఎఫైర్!, అంటగట్టారా?

Subscribe to Oneindia Telugu

పారిస్: ఫ్రాన్స్ మాజీ ప్రథమ మహిళ కార్ల బ్రూనీ ట్రంప్‌తో ఎఫైర్ గురించి సాగుతున్న ప్రచారాన్ని మరోసారి ఖండించారు. 1990ల్లో బ్రూనీతో సాగించిన వ్యవహారం వల్లే ట్రంప్ రెండో భార్యతో ఆయనకు తెగదెంపులు అయ్యాయన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. దీనిపై ఆమె స్పందించారు. ట్రంప్‌తో తనకు సంబంధాన్ని అంటగట్టడం.. వండి వార్చిన కథనంగా చెప్పుకొచ్చారు.

1991లో ట్రంప్ కు.. తన రెండో భార్య మార్లాకు మధ్య బ్రేకప్ అయిందన్న విషయాన్ని న్యూయార్క్ పోస్టు 'ఇట్స్ ఓవర్' పేరిట ప్రకటించిన సమయంలో.. బ్రూనీ పేరు తెరపైకి వచ్చింది. బ్రూనీతో సంబంధం వల్లే రెండో భార్యతో ఆయన విడిపోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బ్రూనీ సైతం అప్పట్లో ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఇంతవరకు తాను ట్రంప్ తో గడిపిన సందర్భమే లేదని తేల్చి చెప్పారు.

Carla Bruni says Donald Trump made up claims they had an affair

అయితే మీడియాతో ట్రంప్ ఈ విషయంపై స్పందించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాజాగా డైలీ బీస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రూనీ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తపరిచారు. ఇదంతా వట్టి అసత్యం కాబట్టే సోషల్ మీడియాలోను ఇంత ప్రచారం జరుగుతుందన్నారు. గూగుల్ తన పేరు గురించి వెతగ్గానే ట్రంప్ తో వ్యవహారం గురించి వస్తోందని బ్రూనీని ప్రశ్నించగా.. బహుశా అది అమెరికన్ గూగుల్ ఏమో అంటూ బ్రూనీ చెప్పడం గమనార్హం.

ఒకవేళ అది ఫ్రెంచ్ గూగుల్ అయితే తన పని, తనకు చెందిన వ్యక్తి, తన యంగేజ్ ఫోటోలు మాత్రమే వస్తాయనని పేర్కొంది. కాగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ.. బ్రూనీని 2008లో వివాహం చేసుకున్నారు. కార్లాకు 15ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Carla Bruni has yet again rebuffed rumours she had an affair with Donald Trump in the early nineties which caused him to break up with his second wife.
Please Wait while comments are loading...