హరికృష్ణకు చంద్రబాబు బంపర్ ఆఫర్: జూ.ఎన్టీఆర్ కోసమే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిటిడి ఛైర్మెన్ పదవిని నందమూరి హరికృష్ణకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.హరికృష్ణకు టిటిడిపి పదవిని కట్టబెట్టడం ద్వారా నందమూరి కుటుంబాన్ని అక్కునచేర్చుకొన్నట్టు అవుతోంది. మరో వైపు ఈ పదవిని ఆశించిన పార్టీలోని నేతలు కూడ నోరు తెరిచే పరిస్థితి ఉండదు. దీంతో వ్యూహత్మకంగా బాబు నందమూరి హరికృష్ణకు ఈ పదవిని కట్టబెట్టాలని భావించారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

టిటిడి ఛైర్మెన్ గా పనిచేసిన చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ పదవి కోసం టిడిపిలో చాలామంది నాయకులు ఆశతో ఎదురుచూస్తున్నారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్ లు కూడ ఈ పదవిని తమకు ఇవ్వాలని చంద్రబాబునాయుడిపై ఒత్తిడి తెచ్చారు.

కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటేడ్ పదవులను ఇవ్వబోనని చంద్రబాబునాయుడు తేల్చేశారు. దీంతో ఈ ఇద్దరు ఎంపీలు కూడ ఈ పదవి కోసం తీవ్రంగానే శ్రమించారు.ఇంకా కూడ తమ ప్రయత్నాలను వీడలేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

అయితే నామినేటేడ్ పదవుల విషయంలో నందమూరి కుటుంబానికి ఓ పదవిని కట్టబెట్టడం ద్వారా పార్టీలో నందమూరి కుటుంబానికి ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదనే సంకేతాలను ఇచ్చినట్టు అవుతోందనే బాబు వ్యూహంగా కన్పిస్తోంది.

హరికృష్ణకు టిటిడి ఛైర్మెన్ పదవి?

హరికృష్ణకు టిటిడి ఛైర్మెన్ పదవి?

మాజీ ఎంపి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణకు టిటిడి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. 2014 ఎన్నికలకు కొద్దికాలం క్రితమే ఆయనకు రాజ్యసభ పదవీకాలం పూర్తైంది. అయితే ఆయనకు రాజ్యసభ పదవిని తిరిగి పునరుద్దరిస్తారని భావించినా పార్టీ అవసరాల రీత్యా రాజ్యసభసభ్యత్వాన్ని ఆయనకు పునరుద్దరించలేదు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా హరికృష్ణ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం టిక్కెట్టును ఆయనకు ఇస్తారనే ప్రచారం కూడ సాగింది. అయితే అనుహ్యంగా ఈ స్థానం నుండి బాలకృష్ణకు బరిలోకి దింపారు చంద్రబాబునాయుడు.అయితే నందమూరి హరికృష్ణకు నామినేట్ పదవిని కట్టబెట్టాలని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు టిటిడి ఛైర్మెన్ పదవిని హరికృష్ణకు ఇవ్వడం వల్ల నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతోందని బాబు భావిస్తున్నారు.హరికృష్ణకు ఈ పదవిని ఇవ్వడం వల్ల ఈ పదవిని ఆశించేవారు మారుమాట్లాడే పరిస్థితి ఉండదు.

జూనియర్ ఎన్టీఆర్ కోసమేనా?

జూనియర్ ఎన్టీఆర్ కోసమేనా?

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు చంద్రబాబునాయుడు. అయతే ఈ సమయంలో కూడ నందమూరి కుటుంబం ఈ కార్యక్రమానికి హజరైంది.అయితే ఈ సమయంలో హరికృష్ణ హజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కాలేదు. లోకేష్ మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో బాలకృష్ణ నందమూరి కుటుంబసభ్యులను దగ్గరుండి ఆహ్వనించారు. 2009 ఎన్నికల ప్రచారం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే హరికృష్ణ కూడ కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఇటీవల కాలంలో తిరిగి పొలిట్ బ్యూరో సమావేశాలకు హజరౌతున్నారు. హరికృష్ణకు టిటిడి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ను కూడ మచ్చిక చేసుకొనే వీలుంటుందనే బాబు ఆలోచించి ఉండవచ్చని రాజీకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నందమూరి కటుంబానికి ప్రాధాన్యత

నందమూరి కటుంబానికి ప్రాధాన్యత

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన కుటుంబసభ్యులు దూరంగానే ఉన్నారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో హరికృష్ణ కొంతకాలంపాటు రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత పరిణామాల్లో ఇటీవల కాలంలో హరికృష్ణ బాబుకు సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా తీసుకొన్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగించారు. అంతేకాదు బాలకృష్ణను హిందూపురం అసెంబ్లీ నుండి టిక్కెట్టు కేటాయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టిటిడి ఛైర్మెన్ పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య పార్టీలో ఎక్కువగా ఉంది.దీంతో హరికృష్ణకు ఈ పదవిని కట్టబెడితే ఈ పదవి కోసం పోటీపడేవారు కూడ నోరు మెదిపే అవకాశం ఉండదు. రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ లతో పాటు పలువురు నేతలు ఇదే పదవిని ఆశిస్తున్నారు.పార్టీ నాయకులకు ఈ పదవిని కట్టబెడితే ఇబ్బందులు కొనితెచ్చుకోవడమేననే అభిప్రాయం కూడ లేకపోలేదు.దీంతో హరికృష్ణకు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా పార్టీ నాయకులు ఎవరూ కూడ ఈ విషయమై నోరు మెదిపే అవకాశం ఉండదని బాబు వ్యూహత్మకంగానే హరికృష్ణ పేరును తెరమీదికి తెచ్చారని పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.

హరికృష్ణకు స్వయంగా చెప్పిన బాబు

హరికృష్ణకు స్వయంగా చెప్పిన బాబు

నందమూరి హరికృష్ణకు టిటిడి ఛైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రెండేళ్ళపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం లేకపోలేదు.హరికృష్ణకు ఏ పదవి లేదు. ఈ విషయాన్ని బాబు హరికృష్ణకు స్వయంగా చెప్పారని సమాచారం. అయితే ఈ విషయమై మీ ఇష్టమని బాబుతో హరికృష్ణ అన్నారని పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.ఎన్టీఆర్ జయంతి రోజునే ఈ విషయాన్ని బాబు హరికృష్ణకు చెప్పారని సమాచారం.అయితే ఈ విషయం ఇటీవల పార్టీ వర్గాల్లో విస్తృతంగా విన్పిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu might appoint actor and former Rajya Sabha member Nandamuri Harikrishna as Tirupati Tirumala Devasthanams chairman.
Please Wait while comments are loading...