అధికారి ఐడియాలు: ఇలాంటివి తేవొద్దని చంద్రబాబు క్లాస్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ అధికారి సలహాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది. కమ్యూనిటీ హాళ్లను అమెరికా టైపులో నిర్మించాలని, గిరిజన ప్రాంతాల్లో కొండల మీద ట్యాంకులు కట్టిద్దామని సూచనలు చేశారట.

ఆ ధైర్యంతో బాబు హామీ, నమ్ముకోలేనని శిల్పా: వైసిపిలో చేరడం ఖాయమా?

ఇలాంటి సలహాలతో చంద్రబాబుకు ఆగ్రహం వచ్చిందని తెలుస్తోంది. సదరు అధికారి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారి అని చెబుతున్నారు. సదరు అధికారి ఇటీవల వింత ఆలోచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పెట్టారని చెబుతున్నారు.

Chandrababu takes class to officer

ఇప్పటికే గ్రామాల్లో ఎందుకూ పనికి రాకుండా ఉన్న కమ్యూనిటీ హాళ్లను కొత్త రూపంలో కట్టవచ్చునని చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఓ కన్సల్టెన్సీ వారు ఈ ప్రతిపాదనను తీసుకుని ఆ అధికారి వద్దకు వచ్చారు. అమెరికా స్టయిల్లో కడదామని కంప్యూటర్ గ్రాఫిక్స్ చూపించారట.

టెక్నాలజీ పైన మోజుపడే చంద్రబాబుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగానే కనిపించిందని, కానీ క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ అధికారికి క్లాస్ తీసుకున్నారని అంటున్నారు.

ఉన్న కమ్యూనిటీ హాళ్లను ఏం చేయాలో అర్ధం కావటం లేదని, డబ్బులు అంటే అంత తేలికగా ఉందా అని, ఉపయోగపడే నిర్మాణలకు నిధులు వెచ్చిస్తే బాగుంటుందని మందలించారని తెలుస్తోంది. దాంతో ఆయన ఏదో కారణం చెప్పి తప్పించుకున్నారని సమాచారం.

వెంటనే ఆయనకు మరో ఐడియా కూడా వచ్చిందట. వెనుకబడిన తరుగతులకు కేటాయించిన నిధులు వినియోగంలోకి రావడంలేదని, బ్యాంకులు కూడా వారికి రుణాలు మంజూరు చేయటం లేదని, దాని వలన ఆ నిధులన్నీ నిరుపయోగంగా ఉండిపోతున్నాయని ముఖ్యమంత్రికి చెప్పారట. దానికి పరిష్కార మార్గం కూడా చూపించారట.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా నగదు బదిలీ మాదిరిగా బీసీలకు ఇచ్చేస్తే బాగుంటుందని చంద్రబాబుతో చెప్పారని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఎక్కడైనా నగదు నేరుగా ఇస్తామా అని నిలదీశారని తెలుస్తోంది.

అంతేకాదు, సదరు అధికారి మరోసారి మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చారట. కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సురక్షిత మంచినీరు అందించేందుకు కొండల పై మంచినీళ్ల ట్యాంకులు కట్టి, అక్కడి నుంచి నీళ్లను పర్వత ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సరఫరా చేస్తే బాగుంటుందని, ఇందుకో ఏజెన్సీ ముందుకు వచ్చిందని సీఎంకు వివరించారని అంటున్నారు.

దీనిపై అక్కడే ఉన్న గ్రామీణ మంచి నీటి సరఫరా విభాగం అధికారులు.. ఇక తాము ఉండి ఎందుకు అని ప్రశ్నించారట. చంద్రబాబు కూడా ఆయనకు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. ఇలాంటి ఐడియాలు తీసుకు రావొద్దని క్లాస్ పీకారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that AP CM Nara Chandrababu Naidu took class to one officer for his ideas.
Please Wait while comments are loading...