బీఫ్: వాజపేయిపై చింతామోహన్ షాకింగ్ కామెంట్స్
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తమకు స్వయంగా గొడ్డు మాంసాన్ని వడ్డించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తమకు స్వయంగా గొడ్డు మాంసాన్ని వడ్డించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన తమకు గొడ్డు మాంసాన్ని వడ్డించిన తర్వాత, మరుసటి ఏడాదికి ఆయన ప్రధాని అయ్యారని చెప్పారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజపేయి తనతో పాటు బీఎస్పీ అధినేత కాన్షీరామ్‌ను విందుకు ఆహ్వానించారని, తన ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటలను వడ్డించారన్నారు.
అంతటి ఉదార స్వభావం ఉన్న నేత కనుకనే అదే రోజు మాయావతిని యూపీ ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. ఆ తర్వాత ఏడాదిలో ఆయన ప్రధానమంత్రి అయ్యారన్నారు.
స్వతంత్ర భారతదేశంలో ఏది తినాలో, ఏది తినకూడదో ఆంక్షలు పెట్టే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. పెద్దమాంసం విక్రయాలపై నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.


Click it and Unblock the Notifications