ఇంకా విభేదాలే.. అధిష్టానంపై అఖిలప్రియ అలక: వద్దన్నా వినకుండా అలా?

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికతో టీడీపీ రాజకీయాలు చీలికలు పేలికలుగా మారుతున్న వైనం కనిపిస్తోంది. తొలుత టికెట్ కోసం మొదలైన పోరు.. శిల్పా మోహన్ రెడ్డిని ఏకంగా పార్టీ వీడేలా చేయగా.. ఇప్పుడు గెలుపుపై ఎక్కడ అంచనా తప్పుతోందనన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.

మంత్రి అఖిలప్రియ దూకుడే నంద్యాలలో పార్టీకి ఈ పరిస్థితి తీసుకువచ్చిందన్న చర్చ టీడీపీలో అంతర్గతంగా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియ సొంత నిర్ణయాలను పక్కనపెట్టి పార్టీ మార్గ నిర్దేశం మేరకు పనిచేయాల్సిందిగా ఆమెకు పరోక్ష సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. అయితే తన నిర్ణయాలను పట్టించుకోని రీత్యా.. మంత్రి అఖిలప్రియ ఒకింత అలకబూనినట్లు చెబుతున్నారు.

ఇన్‌చార్జీలు వద్దన్నా వినకుండా!:

ఇన్‌చార్జీలు వద్దన్నా వినకుండా!:

నంద్యాల ఉపఎన్నిక బాధ్యతను మొత్తం తన భుజాల పైనే మోయాలన్న పట్టుదలతో అఖిలప్రియ ఉన్నారు. మరోవైపు క్షేత్రస్థాయి రిపోర్టులు మాత్రం పార్టీకి కొంత ప్రతికూలంగానే ఉన్నట్లు టీడీపీ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలప్రియ నిర్ణయాలకే ఉపఎన్నికను వదిలేస్తే.. పార్టీకి డ్యామేజీ జరిగే అవకాశం ఉందన్న యోచనలో అధిష్టానం ఉంది.

ఈ నేపథ్యంలోనే ఉపఎన్నిక కసరత్తుల కోసం ఇన్ ఛార్జీలు అవసరం లేదని నేరుగా సీఎంకే అఖిలప్రియ విన్నవించినప్పటికీ.. అధిష్టానం మాత్రం ఆమె మాట పక్కనపెట్టేసింది. ఉపఎన్నిక ఇన్ ఛార్జీగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఏపీఐడీసీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌కు ప్రభుత్వం తాజాగా బాధ్యతలు అప్పగించింది.

సమావేశానికి డుమ్మా!:

సమావేశానికి డుమ్మా!:

భూమాకు సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితోను అఖిలప్రియకు ఇంకా విభేదాలు తొలగిపోనట్లే కనిపిస్తున్నాయి. ఉపఎన్నిక ప్రచారంలో ఈ ఇద్దరూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మంత్రితో సంబంధం లేకుండా ఏవీ సుబ్బారెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు.

ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు, వద్దని చెప్పినా ఇన్‌చార్జీలను నియమించారన్న అసహనంతో బుధవారం నాడు నంద్యాలలో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి సైతం అఖిలప్రియ డుమ్మా కొట్టారు. దీంతో మాజీ మంత్రి ఫరూఖ్, కేఈ ప్రభాకర్, ఏవీ సుబ్బారెడ్డిలే సమావేశాన్ని నడిపించారు.

పరస్పర విరుద్దంగా!:

పరస్పర విరుద్దంగా!:

అఖిలప్రియ తీరు అటు పార్టీకి, పార్టీ తీరు ఇటు అఖిలప్రియకు ఏమాత్రం మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఎవరికి వారు పరస్పర విరుద్దంగా వ్యవహరిస్తుండటంతో నంద్యాల రాజకీయం టీడీపీకి ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందోనన్న టెన్షన్ పార్టీలో అంతర్గతంగా నెలకొంది.

సీనియర్లను పట్టించుకోకుండా.. పార్టీ ఆదేశాలను పెడచెవిన పెట్టిన అఖిలప్రియ 'సవాల్'లు విసరడం టీడీపీ అధిష్టానానికి రుచించడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో తానేం చేసినా.. దాన్ని భూతద్దంలో పెట్టి చేస్తూ తనపై లేని నిందలు వేస్తున్నారనేది అఖిలప్రియ మదిలో మెదులుతున్న ఆలోచనగా తెలుస్తోంది.

కోరి టికెట్ ఇప్పించుకున్నా:

కోరి టికెట్ ఇప్పించుకున్నా:

శిల్పామోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటపడటంతో.. అనుకున్నట్లుగానే భూమా బ్రహ్మానందరెడ్డికి అఖిలప్రియ టికెట్ ఇప్పించుకోగలిగారు. నిజానికి తొలుత ఆ టికెట్ ను భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె నాగమౌనిక ఆశించినప్పటికీ.. వయసు రీత్యా బ్రహ్మానందరెడ్డికే టికెట్ దక్కింది.

అయితే ఏరికోరి టికెట్ ఇప్పించుకున్నా.. జరుగుతున్న పరిణమాలు మాత్రం అఖిలప్రియను సందిగ్దంలోకి నెట్టుతున్నట్లుగా చెబుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధిష్టానం స్వయంగా కల్పించుకుని మరీ.. అందరిని కలుపుకోవాలని చెప్పినా అఖిలప్రియ ఆ మాటను పెడ చెవిన పెట్టేశారు.

మరోవైపు మంత్రితో సంబంధం లేకుండా ఏవీ సుబ్బారెడ్డి ప్రచారం నిర్వహిస్తుండటం కూడా అఖిలప్రియకు మింగుడుపడటం లేదని చెబుతున్నారు. దీంతో అటు నంద్యాల రాజకీయంతో పాటు అఖిలప్రియ భవిష్యత్తు మరింత రసకందాయంలో పడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+