ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

Subscribe to Oneindia Telugu
  Ivanka Trump India Visit : మీ సెల్ ఫోన్ మీద కూడా నిఘా ఉంటుంది, జాగ్రత్త

  హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న వేళ.. కేంద్రానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇవాంకా భద్రత కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

  రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..

  ఇవాంకా ఇండియాలో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి వెళ్లేదాక ఆమె భద్రత మొత్తం అమెరికన్ వైట్ హౌజ్ నిఘా నీడలోనే కొనసాగనుంది. వైట్ హౌజ్ భద్రతా సిబ్బంది ఉన్న ప్రదేశంలో భారత భద్రతా సిబ్బంది ఆయుధాలు లేకుండానే విధులు నిర్వర్తించాల్సి ఉంటోంది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాల నుంచి మార్గదర్శకాలు రావడంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.ఇవాంకా ట్రంప్-

  ఇవాంకా ట్రంప్-యాచకురాలు అంజలి: కన్నీటిగాథకు చలించిన కవిత

  ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఇవాంకా ట్రంప్ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో హెచ్‌ఐసీసీలో జరిగే 8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌(జీఈఎస్)లో భారత పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో రావడానికి వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

   ఎందుకీ ఆంక్షలు?:

  ఎందుకీ ఆంక్షలు?:

  టర్కీలో భద్రత విధులకు వచ్చిన స్థానిక పోలీసు అధికారి రష్యన్‌ అంబాసిడర్‌పై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ భద్రతను మొత్తం వైట్ హౌజ్ వర్గాలే పర్యవేక్షించనున్నాయి. ఈ క్రమంలోనే దేశీ భద్రతా సిబ్బంది ఆయుధాలతో రావొద్దని వారు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్ లో మకాం వేసిన అమెరికన్ భద్రతా సిబ్బంది ఇవాంకా పర్యటనా ఏర్పాట్లను, భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

   ఇవాంకా, మోడీ, కేసీఆర్

  ఇవాంకా, మోడీ, కేసీఆర్

  ఇవాంకాతో పాటు 500 మందితో కూడిన అమెరికా బిజినెస్‌ డెలిగేషన్‌ సమ్మిట్ లో పాల్గొననున్నారు. అలాగే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.

  మొత్తం 1500మంది వరకు పాల్గొనే ఈ సమ్మిట్ కు సంబంధించి తెలంగాణ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) బలగాలను కూడా భారీగా మోహరించే అవకాశాలున్నాయి. ఏర్పాట్లపై అమెరికా భద్రత శాఖ, ఎస్పీజీ, తెలంగాణ పోలీస్‌లు నిరంతర చర్చలు జరుపుతున్నారు

   మోడీ భద్రత ఎలా?:

  మోడీ భద్రత ఎలా?:

  భారతీయ భద్రతా సిబ్బంది ఆయుధాలు లేకుండానే సమ్మిట్‌కు రావాలన్న నిబంధనపై హోంశాఖ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రధానికి నిరంతర భద్రత అందించే ఎస్పీజీ కమెండోలను ఆయుధాలు లేకుండా పంపించడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ విషయంలో ఏం చేయాలన్నది ఇంకా చర్చిస్తూనే ఉన్నారు.

   అమెరికా నుంచే కాన్వాయ్

  అమెరికా నుంచే కాన్వాయ్

  ఇండియాలోను ఇవాంక తన అమెరికా కాన్వాయ్ నే ఉపయోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక విమానాల ద్వారా 20వరకు వాహనాలను హైదరాబాద్ తీసుకొస్తారు. ఇవాంకా ఉపయోగించే కార్లలో ఒక్కో కారులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణిస్తారు. డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు మాత్రమే అందులో ఉంటారు. ఇవాంకా కాన్వాయ్ కు తోడుగా తెలంగాణ అధికారులు సమకూర్చే కాన్వాయ్ కూడా జతకూడితే మొత్తం 60వాహనాలు అవుతాయని తెలుస్తోంది.

   రూట్ మ్యాప్‌పై కసరత్తులు

  రూట్ మ్యాప్‌పై కసరత్తులు

  ఇవాంకా పర్యటన సందర్భంగా.. హెచ్ఐసీసీ, ఫలక్ నుమా ప్యాలెస్ మార్గాల్లో ఆమె రాకపోకలు సాగించే మార్గాల రూట్ మ్యాప్ సిద్దం చేయనున్నారు. ఇందుకోసం కొద్దిరోజుల ముందుగానే రిహార్సల్స్ చేయనుండటం గమనార్హం. అలాగే పాతబస్తీలో కాన్వాయ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఒకవేళ ఇవాంక నగరంలో షాపింగ్ చేయాలనుకున్నా.. ఇక్కడి అందాల్ని చూడాలనుకున్నా.. భద్రతపై ఎలా దృష్టి పెట్టాలని అధికారులో ఆలోచనలో పడ్డారు.

   అమెరికన్ సీక్రెట్ సర్వీస్

  అమెరికన్ సీక్రెట్ సర్వీస్

  ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. హెచ్‌ఐసీసీ, ఫలక్‌నూమా ప్యాలెస్‌, ఇవాంక రాకపోకలు సాగించే మార్గాలన్ని అమెరికన్ భద్రతా అధికారుల నిఘా నీడలో ఉండనున్నాయి. కాన్వాయ్‌లోని వాహనాలతోపాటు భద్రతకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, పరికరాల్ని అమెరికా నుంచే తెప్పిస్తున్నారు.

  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని సెల్ ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. భద్రతా రీత్యా ఫలక్‌నుమా ప్యాలెస్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో తాత్కాలికంగా 500 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయించనున్నారు. ఓ మహిళా ఐపీఎస్ నేతృత్వంలో మహిళా సిబ్బందిని భద్రత ఏర్పాట్ల కోసం నియమించనున్నట్టు తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Global Entrepreneurship Summit (GES) event, an annual meeting of investors and people starting new businesses, is set to run from 28 November to 30 November, and this year is focused on the theme of “empowering women”.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి