గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ వైరాగ్యం, ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి రాజకీయాలపై విసుగు వచ్చినట్లు ఉంది. అక్రమ గనుల కేసులో చిక్కుకుని ముప్పు తిప్పలు పడుతున్న ఆయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెబుతారంటూ వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో ఆయన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

అప్పట్లో కర్ణాటక రాజకీయాల్లో ఆయన చేయి తిరిగిన రాజకీయవేత్తగా వ్యవహరించారు. బిజెపిని అప్పట్లో అధికారంలోకి తేవడంలో ఆయనదే కీలకమైన పాత్ర అని కూడా అంటారు. అక్రమ గనుల కేసులో ఆయన జైలు పాలై ఏడాది క్రితం బయటకు వచ్చారు.

మరో ఏడాదిలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థితిలో జనార్దన రెడ్డి మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగానే సాగింది.. మూడు నెలలుగా బీజేపీలో మరోసారి కీలకంగా వ్యవహరిస్తారని బళ్ళారి, రాయచూరు జిల్లాల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తారని భావించారు.

ఆయన ఇక్కడ పోటీ చేస్తారని...

ఆయన ఇక్కడ పోటీ చేస్తారని...

బళ్ళారి నగరం లేదా సింధనూరు నుంచి గాలి జనార్దన్ రెడ్డి శాసనసభకు పోటీ చేస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగానే సాగింది. కానీ గాలి జనార్దన రెడ్డి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుోవాలని అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.

తెర వెనక మాత్రం రాజకీయాలు..

తెర వెనక మాత్రం రాజకీయాలు..

రాజకీయాల రుచి మరిగిన జనార్దన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటారని భావించలేం. ఆయన తెరవెనుక రాజకీయాలు నడిపే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అవసరమైతే సోదరులు కరుణాకర రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, శ్రీరాములు తరఫున ప్రచారం చేయడానికి చేస్తారని కూడా అంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచనను విరమించుకున్నట్లు గాలి తన సన్నిహితులతో చెప్పారని వినికిడి.

అందుకే దూరంగా....

అందుకే దూరంగా....

ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేస్తే మరిన్ని కేసులు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదని గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని వినికిడి. కూతురు పెళ్లి విషయంలోనూ కేసులు ఎదురయ్యాయని, ఇప్పటికే ఈ కేసులతో సతమతమవుతున్నానని, ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని సమస్యల్ని తెచ్చుకోదలచుకోలేదని ఆయన అన్నట్లు సమాచారం.

అవన్నీ చూశానని గాలి...

అవన్నీ చూశానని గాలి...

రాజకీయాల్లో కొనసాగి మంత్రి లేదా ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నట్లు చెబుతున్నారు. పదేళ్ల క్రితమే అటువంటివన్నీ చూశానని, ఇక రాజకీయాల్లోకి మాత్రం రాదలచుకోలేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక సాధ్యం కాదనే అభిప్రాయానికి కూడా ఆయన వచ్చి ఉండవచ్చునని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Karnataka ex minister Gali Janardhan Reddy has decided not to participate in diect politics in Karnataka.
Please Wait while comments are loading...