వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విస్తుపోయేలా చేస్తుంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విస్తుపోయేలా చేస్తుంది. తన వ్యవహారశైలికి భిన్నంగా, ప్రవర్తనకు భిన్నంగా చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యంం ఇచ్చారనే మాట వినిపిస్తోంది.

ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై పవన్ కల్యాణ్ చంద్రబాబును సోమవారం సచివాలయంలో కలిసిన విషయం తెలిసిందే. దాదాపు గంట పాటు సచివాలయంలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పవన్ కల్యాణ్‌తో భేటీ కోసం చంద్రబాబు తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు

ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి మాత్రమే కాకుండా కాపు ఉద్యమంపై, ఇతర కీలకమైన రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

అవన్నీ వివరించారు...

అవన్నీ వివరించారు...

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు అధికారుల సమక్షంలో ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, కార్మిక, ఉద్యోగాల కల్పన, ప్రణాళిక వంటి పలు శాఖల తీరుపై చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం గ్రామంలోని కిడ్నీ బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Recommended Video

Pawan Kalyan to be the Brand Ambassador of ‘AP Jeevan Dan’ Program
చంద్రబాబు ప్రవేశించే దారిలోనే....

చంద్రబాబు ప్రవేశించే దారిలోనే....

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి ప్రవేశించడానికి వాడే గేటు ద్వారానే పవన్ కల్యాణ్ వాహనం సచివాలయంలోకి ప్రవేశించింది. వాహనం చుట్టూ పవన్ కల్యాణ్ బౌన్సర్లు సందడి చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) ఉన్న బ్లాక్ -1 పోర్టికో వరకు కూడా పవన్ కల్యాణ్ వాహనాన్ని అనుమతించారు.

అంత ప్రాధాన్యమా...

అంత ప్రాధాన్యమా...

పవన్ కల్యాణ్‌కు ఓ ముఖ్యమంత్రి స్థాయి మర్యాదలు చేయడం ఇబ్బంది పెట్టిందని సిఎంవో అధికారులే అంటున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు అంతగా మర్యాద ఇవ్వాల్సి వస్తోందని, అందువల్ల తామేమీ చేయలేమని అంటుననారు.

రాజకీయ కారణాలే.....

రాజకీయ కారణాలే.....

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కులాధిపత్య రాజకీయాల కారణంగా చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారనే ఆశతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.

English summary
Jana Sena chif Pawan Kalyan’s vehicle was allowed to enter the Secretariat through the gate used by the Chief Minister to reach Block-1. There was some criticism at the vehicle, being surrounded by bouncers, being allowed to the portico of Block-1 of the CMO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X