వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: హనీప్రీత్‌కు పోలీసుల హెల్ప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ తప్పించుకునేందుకు కొందరు హరియాణా పోలీసులే సహకరిస్తున్నారని సిట్ ఆరోపించింది. దీంతో ఆమెను పట్టుకునేందుకు మరింత పకడ్భంది ప్రణాళిక సిద్ధం చేశారు.

డేరాబాబా అరెస్టైన సమయం నుండి హనీప్రీత్ సింగ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. నేపాల్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో హనీప్రీత్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

హనీప్రీత్ ఇటీవలనే ఢిల్లీలో లాయర్‌ను కలుసుకొని లొంగిపోయేందుకు ప్రయత్నాలు సాగించింది. అయితే ఢిల్లీలో హనీప్రీత్ బస చేసిన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే అప్పటికే హనీప్రీత్ ఆ ఇంటి నుండి తప్పించుకొంది.

హనీప్రీత్ పోలీసులకు దొరికితే డేరా బాబాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటపడే అవకాశం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. డేరా బాబా కేసులో హనీప్రీత్ కీలకమని పోలీసులు భావిస్తున్నారు.

హనీప్రీత్‌కు పోలీసుల సహకారం

హనీప్రీత్‌కు పోలీసుల సహకారం

డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్‌‌సింగ్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఆరు రాష్ట్రాల్లో ఆమె కోసం వేటాడుతున్నారు. మరోవైపు హనీప్రీత్ పాకిస్తాన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పోలీస్ హంట్ గురించి ఆమెకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. అందుకే తప్పించుకోగలుతుందని సిట్ అనుమానించింది. కొంతమంది రాజకీయ నాయకులకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని సిట్ భావిస్తోంది.హర్యానా ఇంటిలిజెన్స్ అధికారులతోనూ హనీప్రీత్‌కు సంబంధాలు ఉన్నాయి.

హనీప్రీత్ దొరకకపోవడానికి కారణమిదే

హనీప్రీత్ దొరకకపోవడానికి కారణమిదే

కోటి సలహాలు ఇచ్చినా, పోలీసులు ఆదేశించినా డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ పట్టించుకోవడంలేదు. లొంగిపోయే ఆలోచన ఆమెకు ఉన్నట్లు లేదు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాజస్థాన్‌లో కొద్ది రోజులు ఉన్న ఆమె పాకిస్తాన్ పారిపోయేందుకు నెలరోజులు దాటినా హనీప్రీత్‌ను పట్టుకోలేకపోవడానికి అదే కారణమని ఉన్నతాధికారులు అంటున్నారు.పోలీసు అధికారులతో తనకు ఉన్న సంబంధాలతో హనీప్రీత్ తప్పించుకొంటున్నట్టు సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

పోలీసుల దాడులు హనీప్రీత్‌కు తెలుస్తున్నాయి

పోలీసుల దాడులు హనీప్రీత్‌కు తెలుస్తున్నాయి

అందుకే అత్యంత రహస్యంగా జరిగే పోలీసుల దాడుల వివరాలు సయితం ఆమెకు తెలిసిపోతున్నాయి. ఇప్పుడు హనీప్రీత్ పాక్ పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో సరిహద్దురాష్ట్రాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.

జైలుకు వచ్చిన హనీప్రీత్‌ను ఎందుకు వదిలారు?

జైలుకు వచ్చిన హనీప్రీత్‌ను ఎందుకు వదిలారు?

న్యాయస్థానం గుర్మిత్‌ను దోషిగా ప్రకటించిన వెంటనే అల్లర్లకు పురికొల్పారన్న ఆరోపణలను హనీప్రీత్ ఎదుర్కొంటోంది. డేరా అనుచరులను కోర్టు వద్దకు పెద్ద ఎత్తున తరలించడంలోనూ ఆమె పాత్ర ఉందని కేసులు నమోదు అయ్యాయి. పంచకులలో హింస జరిగినా, గుర్మిత్‌తో పాటు ఆమె జైలుకు వచ్చినా విడిచిపెట్టడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు అధికారులతో సత్సంబంధాల కారణంగానే హనీప్రీత్‌ను జైలుకు వచ్చిన వదిలేశారనే చర్చ కూడ సాగుతోంది.హెలీకాఫ్టర్‌లో ఆమె డేరాబాబాతో కూర్చునేందుకు పోలీసులు అనుమతించారంటేనే పోలీసులతో ఆమెకున్న సంబంధాలను అర్థం చేసుకోవచ్చు.

English summary
Honeypreet Insan has been elusive for the last 33 days and has fled from one city to another and allegedly even crossed the international border.who is leaking this information to Honeypreet, are there black sheep within the Haryana police.which is accused of working under pressure from politicians and just paying a lip service in the name of duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X