వీఐపీ సూట్ నుంచి సాధారణ గదికి దాసరి: ఆసుపత్రిలో తడిసి మోపడవుతున్న బిల్లులు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రికే పరిమితమైన దర్శకరత్న దాసరి నారాయణరావు మెడికల్ బిల్లుల గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. కిమ్స్ ఆసుపత్రిలో ఆయన మెడికల్ బిల్లుల ఖర్చు తడిసి మోపైనట్లుగా తెలుస్తోంది. వీఐపీ సూట్ లో చికిత్స పొందుతుండటంతో పాటు బంధువులు, పరామర్శకు వచ్చేవారి కోసం మరికొన్ని సూట్లు తీసుకోవడంతో ఖర్చు భారీగా అయినట్లు సమాచారం.

కాగా, కిమ్స్ ఆసుపత్రిలో ఒక్కో సూట్ కు రూ.40వేలు చార్జీ చేస్తున్నారు. ఎక్కువ సూట్స్ తీసుకోవడంతో పాటు దాసరి కుటుంబ సభ్యులు, పరామర్శకు వచ్చేవారి భోజన, టీ, టిఫిన్ ఖర్చులన్ని ఆసుపత్రి ఖర్చులో జమవుతున్నాయి. ఈ ఖర్చులన్ని కలుపుకుంటే మొత్తం బిల్లు రూ.90లక్షలకు దాకా చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెడికల్ బిల్లులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో దాసరి సైతం వీఐపీ సూట్ నుంచి సాధారణ సూట్ కు మారినట్లు చెబుతున్నారు.

Huge medical bill for Dasari Narayanarao's health treatment in kims hospital

ఇక ఆయన ఆరోగ్య విషయానికొస్తే.. గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్రపిండాల సమస్యలతో దాసరి బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, దాసరి మెడికల్ బిల్లుల ఖర్చు ఆయనే భరిస్తారా? లేక కేంద్ర మాజీ మంత్రి కాబట్టి ప్రభుత్వమే చెల్లిస్తుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood director, Former Central Minister Dasari Narayanarao was getting treatment in Kims hopital. The recent update was his medical bills are so expensive
Please Wait while comments are loading...