వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముళ్లతో డ్యామేజ్: అప్పట్లో మాస్ మహారాజాపై సానుభూతి, మరిప్పుడు?..

ఇన్నాళ్లు తమ్ముళ్ల మూలంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడనుకున్న వారు కూడా.. రవితేజ కూడా ఈ గ్యాంగ్ లో ఉన్నాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీరియల్ ఎపిసోడ్స్‌ను తలపించేలా.. సినిమా క్లైమాక్స్ లను మించిన ఉత్కంఠతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటిదాకా మామూలు టెక్నీషియన్స్, సాదా సీదా నటీ నటులు విచారణకు హాజరు కాగా.. తాజాగా స్టార్ హీరో రవితేజ విచారణను ఎదుర్కొనే తరుణం ఆసన్నమవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సిట్ కార్యాలయానికి నవ్వుతూ రవితేజ: అభిమానుల కోలాహలంసిట్ కార్యాలయానికి నవ్వుతూ రవితేజ: అభిమానుల కోలాహలం

మాస్ మహారాజాగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న రవితేజ.. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఇప్పటికీ చాలామందికి నమ్మశక్యంగా లేదు. నిజానికి రవితేజ తమ్ముళ్లు భరత్, రఘులు పలుమార్లు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా ఆయనపై జనంలో విపరీతమైన సానుభూతి ఏర్పడింది.

తమ్ముళ్లతో డ్యామేజ్.. మరిప్పుడు?

తమ్ముళ్లతో డ్యామేజ్.. మరిప్పుడు?

స్వయంకృషితో ఎదిగొచ్చిన రవితేజ ఇమేజ్‌కు తమ్ముళ్లు గండికొడుతున్నారన్న అభిప్రాయాలు అప్పుడు వ్యక్తమయ్యాయి. భరత్ చనిపోయిన సమయంలోను రవితేజ దూరంగా ఉండటాన్ని బట్టి.. తమ్ముడి జీవితం గాడి తప్పబట్టే ఆయన అంత్యక్రియలకూ హాజరుకాలేదన్న వాదన వినిపించింది.

Recommended Video

Ravi Teja Skipped His Brother Bharat's Funeral? Find out the Facts | Filmibeat Telugu
గ్యాంగ్‌లో రవి కూడానా?

గ్యాంగ్‌లో రవి కూడానా?

కానీ అనూహ్యంగా డ్రగ్స్ రాకెట్‌తో రవితేజకు లింకులున్నాయా? అన్న అనుమానాలు తెర పైకి రావడం.. ఆయన్ను ఇరుకునపడేలా చేసింది. ఇన్నాళ్లు తమ్ముళ్ల మూలంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడనుకున్న వారు కూడా.. రవితేజ కూడా ఈ గ్యాంగ్ లో ఉన్నాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ అనుమానాలు:

ఇవీ అనుమానాలు:

జీశాన్ వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే.. రవితేజకు అతనితో 8ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి తమ్ముళ్లతో పాటు రవితేజ కూడా గాడి తప్పాడా? అన్న అనుమానం కలగకమానట్లేదు. అయితే విచారణకు ముందే దీనిపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదు కాబట్టి.. సిట్ విచారణలో రవితేజ పాత్ర గురించి ఏం తేలుతుందో వేచి చూడాలి.

అరెస్టులు ఉంటాయా?:

అరెస్టులు ఉంటాయా?:

ఇకపోతే సిట్ విచారణ తుది దశకు చేరుకోవడంతో.. తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుందన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బలమైన సాక్ష్యాధారాలు చూపించి ఎవరినైనా అరెస్టు చేస్తారా? లేక మిగతా కేసుల్లాగే ఇది కూడా కొన్ని రోజులకు నీరుగారి పోతుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఇకపోతే ఛార్మీ, ముమైత్ ఖాన్ మినహా ఈ కేసులో నోటీసులు అందుకున్న వారందరిని సిట్ అధికారులు 10గం.కు పైగానే విచారించారు. ఈ నేపథ్యంలో రవితేజను ఎంతసేపు విచారిస్తారన్నది ఆసక్తికరం. అలాగే విచారణను ఎలా విచారణను ఎదుర్కోవాలని ఇప్పటికే లాయర్ల సలహాలను స్వీకరించిన రవితేజ.. సిట్ ప్రశ్నలకు ఎంతమేర సమాధానం చెప్తారన్నది వేచి చూడాలి.

English summary
Ravi Teja, one of the top Telugu film heroes, will be grilled by the Special Investigation Team (SIT) of the excise department on the drugs issue on Friday .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X