దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

కెసిఆర్‌‌‌కు ఝలక్: వచ్చే ఎన్నికల్లో తెరాస గెలిచేది ఇన్ని సీట్లే...

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: నిన్న, మొన్నటివరకు దాదాపు అన్ని సీట్లు తమవేనని అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢంకా బజాయించి మరీ చెప్పారు. ప్రత్యేకించి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సర్వేల్లో పరిస్థితులను మదిస్తూ.. ప్రత్యామ్నాయ వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమవుతున్నారు. తాజా సర్వే ప్రకారం కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 52 స్థానాలు వస్తాయని, మరికొంచెం చెమటోడ్చి కష్ట పడితే 18 స్థానాల్లో విజయం సాధిస్తామని తేలిందట. శక్తిని మించి పనిచేస్తే మరికొన్ని సీట్లు బోనస్ అవుతుందని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

  2014లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉర్రూతలూగుతున్న సమయంలోనే 63 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. తాజా సర్వేలో 52 స్థానాలకు పడిపోవడంతో బలహీన స్థానాలుగా గుర్తించిన సెగ్మెంట్ల పరిధిలో ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం 52 సీట్లు వచ్చే ఊపు కూడా లేదని కొందరు వాదిస్తున్నారు. సీట్లు పెరిగే అవకాశమే లేకుండా.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 40 మందిని తగ్గించుకునే వ్యూహాన్ని 'గులాబీ' బాస్ అనుసరిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.

  ఆరుగురు కాంగ్రెస్ మాజీ మంత్రులకు గాలం

  ఆరుగురు కాంగ్రెస్ మాజీ మంత్రులకు గాలం

  మరోవైపు ఇతర పార్టీల్లో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలను ఆకర్షించే పనిలో ‘గులాబీ' పార్టీ అధినాయకత్వం బిజిబిజీగా ఉన్నదని తెలిసింది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు మాజీ మంత్రులతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చలు జరిపిందని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకునేలా వ్యూహ రచన అమలు చేయాలన్నది టీఆర్ఎస్ అధి నాయకత్వం సంకల్పంగా కనిపిస్తున్నది. దీన్ని బట్టి మరోసారి విపక్ష పార్టీల నుంచి ‘ఆపరేషన్ ఆకర్ష్' ఇబ్బడి ముబ్బడిగా సాగనున్నదని సమాచారం.

  తాజా సర్వేతో సిట్టింగ్ ఎమ్మెల్యేల లబోదిబో

  తాజా సర్వేతో సిట్టింగ్ ఎమ్మెల్యేల లబోదిబో

  తాజా సర్వే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు వ్యతిరేకమా? లేదా? ఇంకా పార్టీలో అంతర్గత రాజకీయాలు ఇమిడి ఉన్నాయా? అన్న విషయమై స్పష్టత రాలేదు. ఈ పరిస్థితుల్లో తమ పార్టీలో ఏం జరుగుతున్నదో అవగతం కావడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు వినికిడి. పార్టీ పట్ల ఆదరణ తగ్గుతున్నదా? లేక సీట్లు పెరగవని తెలిస్తే ఇతర పార్టీల వారిని చేర్చుకునే వ్యూహం దాగి ఉన్నదా? అన్న సంగతి తెలియడం లేదని కొందరు ఎమ్మెల్యేల అనుచరుల అభిప్రాయం. తాజా సర్వేతో టీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం మొదలైందని వినికిడి. మొన్నటివరకు 106 స్థానాల్లో గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయని ఊదరగొట్టిన సీఎం కేసీఆర్.. తాజా సర్వే వివరాలు సదరు ఎమ్మెల్యేల చేతిలో పెట్టేస్తున్నారు. దాన్ని చూసిన ఎమ్మెల్యేలు గుండెలు బాదుకుంటున్నారని, పైకి ఏమీ అనలేక లోలోపల మదనపడుతున్నారు. అంతకుమందు మొదటి సర్వే ప్రకారం కూడా అధిక సీట్లలో గెలుస్తామని తేల్చారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సునాయసంగా 80 స్థానాల్లో గెలుపొందుతామంటూనే.. కొందరు ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారు.

  నాలుగు జిల్లాల్లో 14 మంది ఎమ్మెల్యేలకు డౌటే

  నాలుగు జిల్లాల్లో 14 మంది ఎమ్మెల్యేలకు డౌటే

  కానీ కొత్త సర్వేలో 52 స్థానాల్లో మాత్రమే గెలుస్తామన్న సంకేతాలతో సీఎం కేసీఆర్ ఆశ్చర్య చకితులయ్యారని వినికిడి. పార్టీ కంటే ఎమ్మెల్యేల పనితీరుపై వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు, నిజామాబాద్‌లో నాలుగు, నల్లగొండలో మూడు, మహబూబ్ నగర్ జిల్లాలో మూడు స్థానాల్లో ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తున్నది. సెంటిమెంట్‌తోపాటు ప్రజాభిమానాన్ని చూరగొనకుంటే వ్యతిరేకత ఖాయమని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని సదరు ఎమ్మెల్యేలను హెచ్చరించారని సమాచారం. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలకు ఇతోధిక ప్రచారం కల్పించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హితవు చెప్పినట్లు తెలుస్తోంది. అలా చేస్తేనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లొస్తాయని కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ఖరాకండిగా తెలుస్తున్నది.

  కాంగ్రెస్ పార్టీకి ముందరి కాళ్ల బంధం.. టీడీపీ సీనియర్లపై నజర్

  కాంగ్రెస్ పార్టీకి ముందరి కాళ్ల బంధం.. టీడీపీ సీనియర్లపై నజర్

  తాజా సర్వే ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై మానసికంగా పైచేయి సాధించడానికి కాంగ్రెస్, టీడీపీల నుంచి ముఖ్య నేతలకు గాలం వేయడం ద్వారా, వారిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మానసికంగా పైచేయి సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ముందటి కాళ్లకు బంధాలు వేసేందుకు టీఆర్‌ఎస్‌ భారీ స్కెచ్‌ను సిద్ధం చేస్తోంది. కేవలం కాంగ్రెస్‌ పార్టీకే పరిమితం కాకుండా టీడీపీలో ఇంకా మిగిలి ఉన్న కొందరు సీనియర్లపైనా దృష్టి సారించినట్లు చెబుతున్నారు.మొత్తంగా విపక్ష పార్టీలను బలహీన పరిచేందుకు, ఎన్నికల్లోగా తమ బలం పుంజుకునే వ్యూహంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ ఆపరేషన్‌ బాధ్యతలు అప్పజెప్పిందని చెబుతున్నారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోగానే ముగ్గురు మంత్రులు పని విభజన చేసుకుని మరీ కొడంగల్‌ నియోజకవర్గంపై పడిపోయారు. మండలాల వారీగా వివిధ వర్గాల టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కొడంగల్‌లో మరో పార్టీకి స్థానం లేదన్న అభిప్రాయం బలపడేలా చేరికలను ప్రోత్స హించి రేవంత్‌ అనుచరవర్గం కాంగ్రెస్‌ గడప తొక్కకుండా నిలువరించగలిగారు.

  చర్చలు సాగిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు

  చర్చలు సాగిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు

  రాష్ట్ర వ్యాప్తంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితిని బట్టి పలు పార్టీల నుంచి ఈ చేరికలను ప్లాన్‌ చేశారని అంటున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల పనితీరుపై ఓ అంచనాకు వచ్చిన అధినాయకత్వం వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో ఓడిపోయినా, రెండో స్థానంలో నిలిచిన నాయకులు, వారికొచ్చిన ఓట్లు, మూడున్నరేళ్ల తర్వాత స్థానిక ప్రజల్లో ఆ నేతలకు ఉన్న పట్టు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారని సమాచారం. ఇప్పటికే నల్లగొండ, భూపాలపల్లి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవే సమీకరణాలతో విజయవంతంగా చేరికలను పూర్తి చేశారు. పాత వరంగల్, నిజామాబాద్‌ జిల్లాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు టీఆర్‌ఎస్‌ నాయకత్వంతో చర్చలు జరిపారని, వారి చేరికకు ముహూర్తం కుదరాల్సి ఉందని తెలిసింది. చేరికల తర్వాత మార్పులు చేర్పుల్లో భాగంగా తమ పార్టీకే చెందిన కొందరు సిట్టింగులకు అవకాశం ఇవ్వలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, వారిని పక్కన పెట్టేయకుండా ఎమ్మెల్సీ, ఇతర అధికారిక పదవుల తాయిలం కూడా చూపుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం.

  ఆరు రిజర్వుడ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో చాన్స్

  ఆరు రిజర్వుడ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో చాన్స్

  తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల వల్ల లాభం లేదనుకుంటున్న చోట కచ్చితంగా ఇతర పార్టీల నుంచి నేతలను దిగుమతి చేసుకోవడానికే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కాగా, త్వరలోనే ముఖ్య నేతలను మూకుమ్మడిగా చేర్చుకోవడం ద్వారా మానసికంగా పై చేయి సాధించే వ్యూహరచన జరుగుతోందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్న గులాబీ నాయకత్వం, ప్రత్యామ్నాయ ఆలోచనలపైనా దృష్టి పెట్టిందని, దీనిలో భాగంగానే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రుల వంటి వారికి గాలం వేస్తోందని వినికిడి. కాంగ్రెస్‌కు చెందిన కనీసం అరడజను మంది మాజీ మంత్రులు టీఆర్‌ఎస్‌ నాయకత్వంతో మంతనాలు జరిపారని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని ఆరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో చేరికల ప్రణాళికను ఇప్పటికే రచించారంటున్నారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు, హైదరాబాద్‌ సిటీలో కొందరితో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే.. ఎంపీ సీటు కోసం చర్చలు చేశారని, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనే అవకాశం కోసం మరో నేత ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాగా, ఇదే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన ఒక మంత్రితో టచ్‌లో ఉన్నారంటున్నారు.

  English summary
  If now will go trs would won 52 seats in Assembly. As per TRS party sources Party high command survey reveals some sensational devolopments. So many districts MLA's facing incumbency factor that's way CM KCR focus on 'Operation Akarsh' from opposition parties.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more