‘శశికళ ఆ పేరు పెట్టుకుంటే తిరుగేలేదు! లేదంటే ప్రాణాపాయమే’
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పేరు మార్చుకుని ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హస్త సాముద్రికుడు, ఫేస్ రీడర్ ఎం రమణారావు స్పష్టం చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పేరు మార్చుకుని ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హస్త సాముద్రికుడు, ఫేస్ రీడర్ ఎం రమణారావు స్పష్టం చేశారు. శశికళను కలిసేందుకు శుక్రవారం చెన్నై చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
శశికళ అనేది నెగెటివ్ పేరు అని, అలాకాకుండా 'జయలలిత సెకండ్' అని పేరు పెట్టుకుంటే ముమ్మాటికీ ముఖ్యమంత్రి కాగలిగేవారని పేర్కొన్నారు. అంతేగాక, ఆ పేరు పెట్టుకోవడం ద్వారా ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి కూడా గట్టెక్కుతారని పేర్కొన్నారు.

ఆ పేరుకు తిరుగే లేదని, కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చినా అరెస్ట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం 'వేద నిలయం' వాస్తు పరంగా కొన్ని నెగెటివ్ వైబ్రేషన్స్ పంపుతోందన్నారు. అది జయకు బాగున్నా, శశికళకు ప్రమాదకరమని వివరించారు.
శశికళ పేరును బట్టి ఆమె ఆహారంలో ప్రత్యర్థులు విషం కలిపే అవకాశం ఉందన్నారు. ఇక పన్నీర్ సెల్వం ఇప్పుడు సీఎం కాగలిగినా రెండు మూడు నెలలకు మించి ఆయన ఆ పదవిలో కొనసాగలేరని రమణారావు జోస్యం చెప్పారు. సీఎం పదవి కోసం పన్నీరు, శశికళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రమణారావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications