రజినీకాంత్‌పై బిజెపి దెబ్బ: చిద్దూ ఫ్యామిలీపై ఐటి దాడులు?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత పి. చిదంబరం కుటుంబ సభ్యుల ఆస్టులపై దాడులకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి ముడిపెడుతున్నారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిదంబరాన్ని తన పొలిటికల్ మెంటర్‌గా నియమించుకోవాలని రజనీకాంత్ భావించినట్లు చెబుతున్నారు. దీన్ని బిజెపి పసిగట్టడం వల్లనే చిదంబరం కుటుంబ సభ్యుల ఆస్తులపై ఐటి దాడులు జరిగాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రజనీకాంత్‌ను దెబ్బ తీయడానికే ఆ పని జరిగిందని వార్తలు వస్తున్నాయి.

చిదంబరాన్ని, ఆయన కుమారుడు కార్తిని కేసుల్లో ఇరికించడం ద్వారా రజనీకాంత్‌ను నైతికంగా దెబ్బ తీయాలనే వ్యూహాన్ని బిజెపి రచించినట్లు చెబుతున్నారు.

అప్పుడు చో రామస్వామి...

అప్పుడు చో రామస్వామి...

ఒకప్పుడు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చో రామస్వామి అన్నీ తానే వ్యవహరించారు. ఆయన సలహాల మేరకే రజనీకాంత్ నడుచుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఆయన మరణించడంతో రజనీకాంత్ చిదంబరాన్ని తన రాజకీయ సలహాదారుగా నియమించుకోవాలని రజనీకాంత్ భావించారని సమాచారం. చిదంబరానికి విశేషమైన రాజకీయానుభవం ఉండడమే అందుకు కారణమని అంటున్నారు.

రజనీకాంత్ వస్తే....

రజనీకాంత్ వస్తే....

రాజకీయాల్లో అడుగుపెడితే తమిళనాడులో రజనీకాంత్‌నే విజయం వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రజనీకాంత్‌ను దెబ్బ తీయడానికి బిజెపి పావులు కదుపుతోందని అంటున్నారు. బిజెపితో కలవాలని అమిత్ షా రజనీకాంత్‌తో రాయబారాలు నడిపినట్లు చెబుతారు. అయితే, అందుకు రజనీతాంక్ ససేమిరా అన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో బిజెపి రజనీకాంత్‌ను టార్గెట్ చేసినట్లు వినికిడి.

సుబ్రహ్మణ్యస్వామి ఇలా...

సుబ్రహ్మణ్యస్వామి ఇలా...

తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని రజనీకాంత్ చెప్పడంపై బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని ఆయన ఓ జోక్‌గా కొట్టిపారేశారు. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. రజనీకాంత్‌కు స్పష్టమైన సిద్ధాంతం లేదని, గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారని, తరుచుగా నిర్ణయాలు మార్చుకుంటారని ఆయన అన్నారు.

 సెంటిమెంట్ కూడా వాడారు...

సెంటిమెంట్ కూడా వాడారు...

రజనీకాంత్ విషయంలో తమిళ స్థానిక మనోభావాలను సుబ్రహ్మణ్యస్వామి వెలికి తీశారు. రజనీకాంత్ అసలు తమిళుడే కారని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ అని ఆయన వ్యాఖ్యానించారు. రజనీకాంత్ అభిమానులున్న మాట వాస్తవమేనని, అయితే వారు రజనీకాంత్ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవారు కారని, ఓ గంపులా రజనీకాంత్‌ను ఆరాధిస్తున్నారన ఆయన అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that It raids on Chidambaram's family assets were taken place to give a moral blow to Tamil super star Rajinikanth.
Please Wait while comments are loading...