పోలవరం: చంద్రబాబుకు మరో చిక్కు, తెలంగాణ ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులను ఆపేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.

కేంద్రం కల్పించిన చిక్కులతో సతమతవుతున్న చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం మరో చిక్కు తెచ్చి పెట్టింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు.

పోలవరంపై నవీన్ పట్నాయక్ ఇలా..

పోలవరంపై నవీన్ పట్నాయక్ ఇలా..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశాతోపాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చెప్పారు.

నవీన్ పట్నాయక్‌తో కడియం భేటీ..

నవీన్ పట్నాయక్‌తో కడియం భేటీ..

భువనేశ్వర్‌లో పర్యటిస్తున్న కడియం శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించారు. పోలవరంపై ప్రాజెక్టుపై కడియం శ్రీహరి నవీన్ పట్నాయక్‌కు ఓ నోట్ ఇచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాతో పాటు తెలంగాణ కూడా నష్టపోతుందని కడియం శ్రీహరి అన్నారు.

ఏడు మండలాలు ఇలా...

ఏడు మండలాలు ఇలా...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగించడానికి కేంద్రం గతంలో తెలంగాణ భద్రాచలం ఏరియాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విజయం సాధించారు. దానిపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉన్నప్పటీకి మౌనం వహించింది. అయితే ముంపు మండలాల ప్రజలు మాత్రం ఆందోళన చేస్తూనే ఉన్నారు.

పోలవరంపై ఆ రాష్ట్రాలు కూడా....

పోలవరంపై ఆ రాష్ట్రాలు కూడా....


పోలవరం ప్రాజెక్టును ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా కర్ణాటక, మహారాష్ట్రలు కూడా చేతులు కలిపాయి. పోలవరంపై ప్రాజెక్టుపై ఆ రాష్ట్రాలు కోర్టుకు ఎక్కాయి. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అయితే, జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాల్సి ఉంటుంది, అయితే నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు తన భుజాన వేసుకన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించాలని ఒడిశా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Meeting with Odisha CM Naveen Patnaik Telangana deputy CM Kadiyam Srihari has given a new twist to Polavaram project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి