నారా లోకేష్ మైండ్ సెట్: మనస్తత్వ విశ్లేషకుల వద్ద శిక్షణ
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గతంలో పొంతన లేకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటలను తీసుకుని ప్రత్యర్థులు ఆయనను హేళన చేసే ప్రయత్నాలు కూడా చేశారు.
తెలుగుదేశం పార్టీలో మైండ్ సెట్ మార్చేందుకు చంద్రబాబు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. అది కూడా తమకు అవసరమైన విధంగా వారి మైండ్ సెట్ మార్చేందుకు మానసిక విశ్లేషకులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ స్థితిలోనే తన మనస్తత్వ లోపాలపై కూడా లోకేష్ శిక్షణ తీసుకుంటున్నారు.
మైండ్ సెట్ మార్చేందుకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం క్రమంగా మండల, గ్రామస్థాయిలకు విస్తరిస్తుంది.

మనస్తత్వ శిబిరం....
మంగళగిరి హేపీ రిసార్ట్స్‌ను తెలుగుదేశం పార్టీ రాజకీయ, మనస్తత్వ శిక్షణా శిబిరంగా మార్చారు చంద్రబాబు. పోల్ మేనేజ్‌మెంట్, పొలిటికల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ మేనేజ్‌మెంట్ అంశాలపై ఆయన క్లాసులు కూడా తీసుకున్నారు. అందరికీ ట్యూబులిచ్చి ఓ పరీక్ష పెట్టారు.

మనస్తత్వ విశ్లేషణలో....
మనస్తత్వ విశ్లేషణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన థామస్ కంపెనీ ప్రతినిధులు తయారు చేసిన 24 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు రాబట్టారు. ఆ సమాధానాలను బట్టి నాయకుల బలాబలాలను, బలహీనతలను విశ్లేషించి, ఏ విధమైన శిక్షణ ఇవ్వాలో ఖరారు చేస్తారు. ఇటువంటి శిక్షణనే నారా లోకేష్ కూడా తీసుకుంటారు.

నారా లోకేష్ ఇలా....
ప్రతి మనిషిలో కొన్ని లోపాలుంటాయని, సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే ఆ వ్యక్తి నుంచి రాబట్టే ఫలితాలు ఇంకా బాగుంటాయని, తాను ముందుగా ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నానని నారా లోకేష్ చెప్పారు. అందులో తన లోపాలు కొన్ని తెలిశాయని వాిని సవరించుకోవడానికి మనస్తత్వ విశ్లేషకుడి వద్ద శిక్షణ తీసుకుంటున్నానని ఆయన చెప్పారు.

పరీక్ష పూర్తి చేయడానికి...
చంద్రబాబు పెట్టిన పరీక్షను పూర్తి చేయడానికి కొంత మంది నాయకులు చెమటోడ్చారు. ట్యూబులు తెరిచి, పరీక్షలో పాల్గొనడం కొంత మంది నాయకులకు చేతకాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంది అందులో వాడిన పదాలు చాలా కఠినంగా ఉన్నాయని, అంత సులభంగా అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా చంద్రబాబు పెద్ద ప్రయోగానికే శ్రీకారం చుట్టారని అనుకోకతప్పదు.












Click it and Unblock the Notifications