షాకిచ్చిన శశికళ: గవర్నర్‌కిచ్చిన మద్దతుదారుల జాబితాలో ‘పన్నీరు సెల్వం’

శశికళకు వ్యతిరేకంగా పోరాడుతూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటున్న పన్నీరు సెల్వం పేరును తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలా జాబితాలో చేర్చారు శశికళ.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి తనను బలవంతంగా రాజీనామా చేయించారంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యరేతికంగా తిరుగుబాటు చేసిన అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతోపాటు అందరికీ ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఇది. ఎందుకంటే శశికళకు వ్యతిరేకంగా పోరాడుతూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటున్న పన్నీరు సెల్వం పేరును తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలా జాబితాలో చేర్చారు శశికళ.

అంతేగాక, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారంటూ.. వారి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారంటూ ఆ పేర్ల జాబితాను సమర్పించారు. కాగా, ఈ జాబితాలో శశికళ తన ప్రత్యర్థి పన్నీర్‌ సెల్వం పేరునూ చేర్చడం గమనార్హం.

 panneerselvams name is in sasikala supporting mlas list!

'ఎమ్మెల్యేలంతా నా వెంటనే ఉన్నారు. అవసరమైతే రాజ్‌భవన్‌కు తీసుకొచ్చి మీముందు హాజరుపరుస్తాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించండి' అని గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. శశికళ వాదనను విన్న గవర్నర్‌... 'పరిశీలించి చెబుతాను' అని పంపించారు. ఇదే సమాధాన్ని పన్నీరుకు కూడా గవర్నర్ చెప్పారు.

అయితే, గవర్నర్‌తో సమావేశం ముగిసిన అనంతరం శశికళ నిరాతో బయటికి రాగా, పన్నీరు సెల్వం మాత్రం ఉత్సాహంగా కనిపించారు. అంతేగాక, శశికళ ఇంటికి వెళ్ళిన తర్వాత తన చేతిలోని ఫైళ్లను విసిరికొట్టి, కన్నీటి పర్యాంతమైనట్లు సమాచారం. గవర్నర్ తో భేటీ అనంతరం ఆమె మీడియాతో కూడా మాట్లాడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+