స్మగ్లర్‌కు హడలెత్తించాడు, కానీ: ఆ పోలీస్ ఇంట్లోనే భారీగా డబ్బు కట్టలు, డ్రగ్స్!

Subscribe to Oneindia Telugu

చండీగఢ్: పంజాబ్‌లో రాష్ట్రంలో ఆయన పేరు చెబితే ఏ స్మగ్లర్ అయినా హడలిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది మరి. ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసినా.. వారిని పట్టుకుని తాట తీసేస్తాడు. కానీ, చివరకు ఆ పోలీసు అధికారే కటకటాల పాలయ్యాడు. ఎందుకంటే.. ఆయన స్మగ్లర్లకే స్మగ్లరన్న విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి రావడం.

వివరాల్లోకి వెళితే.. నేరగాళ్లను, స్మగ్లర్లను హడలెత్తించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్ సింగ్ ఇంట్లో పెద్దమొత్తంలో నార్కోటిక్స్, డబ్బుకట్టలు, ఏకే 47 ఆయుధాలు పట్టుబడ్డాయి. దీంతో సోమవారం రాత్రి పోలీసులు ఇంద్రిజిత్‌ ముఖానికి ముసుగుకట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లడంతో అప్పటి వరకు ఉన్న ఆయనకున్న మంచి పేరు కాస్తా గంగలో కలిసిపోయింది.

డ్రగ్స్ పట్టుకోవడంతో మంచి చురుకైన అధికారిగా పేరుతెచ్చుకున్న ఇంద్రజిత్.. పోస్టింగ్ ఇచ్చిన ప్రతిచోటా అంతే ప్రశంసలు అందుకున్నారు. ఆయన చేపట్టిన అన్ని తనిఖీల్లో వందశాతం విజయం సాధించినప్పటికీ.. కేసుల్లో డొల్లతనం కారణంగా నిందితులంతా ఏదోరూపంలో విడుదలయ్యారు.

Punjab Police Officer, Star Of High-Profile Drug Busts, Arrested

ఓ చోట పోస్టింగ్ ఇచ్చిన 14 నెలల్లోనే 12 చోట్ల డ్రగ్స్ 'రికవరీ' చేశారు. అయితే, ఏదో మతలబు ఉందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. కాగా, ఇటీవల కూడా అత్యధికంగా 19 కిలోల డ్రగ్స్ పట్టుబడినా నిందితులు కోర్టు నుంచి బెయిల్ పొందారు.

తరచూ ఇలాంటివి రిపీట్ కావడంతో మరింత అనుమానాలు బలపడినట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ హర్‌ప్రీత్ సిద్ధూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై నిఘా వేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను విడిపించేందుకు ఇంద్రజిత్ సింగ్ పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టు సిద్దూ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Inderjit Singh, an inspector, had an impressive record of drug seizures at every posting. He was allegedly exposed when officers started analyzing over a dozen "recoveries" chalked up by him.
Please Wait while comments are loading...