‘2కళ్ల సిద్ధాంతం ఎవరిది?, లోకసభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేసిందెవరు?’: ఉద్యోగ పరీక్షలో ప్రశ్నలివే!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఆసక్తికర, ఆశ్చర్యకరమైన ప్రశ్నలు అడిగారు. వాటిలో ఓ ప్రశ్న ఇలావుంది.. 'రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిందెవరు?'.

ఈ ప్రశ్నకు ఆప్షన్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సీపీఎం నేత బీవీ రాఘవులు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్లను ఇచ్చారు.

questions about Chandrababu and lagadapati in Telangana Exam paper

మరో ప్రశ్నగా.. 'లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు?' అని అడిగారు. దీనికి ఆప్షన్లుగా జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, నారమల్లి శివప్రసాద్, సుజనా చౌదరి పేర్లను ఇచ్చారు.

కాగా, తెలంగాణ ఉద్యమం నడస్తున్న సమయంలో ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని చంద్రబాబునాయుడు పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక లోకసభలో పెప్పర్ స్ప్రేను ఉపయోగించింది లగడపాటి రాజగోపాల్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇది అప్పట్లో సంచలనంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that some questions asked about AP CM and TDP president Chandrababu Naidu and former MP Lagadapati Rajagopal in a Telangana Exam paper.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి