వింత: ఉద్యోగమిచ్చేందుకు 40 కంపెనీల నిరాకరణ, ఆ పేరు చెబితేనే వణికిపోతోన్న కంపెనీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

జార్ఖండ్:ఓ పేరు అతనికి ఉద్యోగం రాకుండా చేస్తోంది. అతని స్నేహితులు మంచి పొజిషన్ లో ఉన్నారు. కాని, కేవలం ఆయనకు తాత పెట్టిన పేరు కారణంగానే ఉద్యోగం రాకుండా పోయింది. ఆయనకు ఉద్యోగం ఇవ్వాలని ఆసక్తి చూపిన కంపెనీలు ఆయనకున్న పేరును చూసి జాబ్ ఇచ్చేందుకుగాను నిరాకరిస్తున్నారు. ఉద్యోగం రాకపోవడంతో ఆ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ కు చెందిన మేరిన్ ఇంజనీర్ సద్దాం హుస్సేన్ కు ఉద్యోగం రావడం లేదు. ఆయనకున్న పేరు వల్లే ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి పలు కంపెనీలు నిరాసక్తతను చూపుతున్నాయి.

Rejected for jobs 40 times, this Saddam Hussain goes to court for a new identity

ఇరాక్ ను గతంలో పాలించిన సద్దాం హుస్సేన్ కు కూడ నియంతగా పేరుంది.ప్రజలపై అనేక అకృత్యాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సద్దాం హుస్సేన్ ను 2003 లో అమెరికా గద్దెదించింది.ఆ తర్వాత అమెరికా సేనల దాడుల్లో సద్దాం మరణించాడు.

జార్ఖండ్ కు చెందిన సద్దాం హుస్సేన్ కుఆయన తాత ఈ పేరు పెట్టాడుప్రేమతో తాత యువ ఇంజనీర్ కు చిన్నతనంలో ఈ పేరు పెట్టాడు. చదువు పూర్తయ్యేవరకు సద్దాంకు ఇబ్బందులు రాలేదు.

తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్శిటీ మెరిన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సద్దాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటివరకు 40 కంపెనీలకు ఉద్యోగాలకు హజరయ్యాడు. అయితే అనేక మల్టీనేషనల్ కంపెనీలు షిప్పింగ్ కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగినా నిరాశే ఎదురైంది.

సద్దాం అనే పేరు ఉండడం వల్ల వెంటనే అనుమానం వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే తనలికి ఉద్యోగం ఇవ్వడానికి టాప్ కంపెనీలు నిరాకరిస్తున్నాయని డిల్లీకి చెందిన రిక్రూట్ మెంట్ కన్సల్టెంట్ సంస్థ టీమ్ లీజ్ సర్వీసెస్ అభిప్రాయపడింది.

ఈ కష్టాల నేపథ్యంలలో సద్దాం ఇప్పుడు తన పేరును సాజిద్ గా మార్చాలని ఈ మేరకు తన పదోతరగతి సర్టిఫికెట్లలో మార్పులు చేసేందుకుగాను సిబిఎస్ ఈ కి ఆదేశాలు ఇవ్వాలంటూ ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. తన తాత ప్రేమతో పెట్టిన పేరే ఇప్పుడు తనకు పీడకలను మిగిల్చిందన్నారు. కేవలం పేరు కారణంగానే నిద్రలేని రాత్రులు గడిపానని సద్దాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
His grandfather had lovingly given him his name, hoping that one day he would grow up into a ‘positive’ human being. Some 25 years later, the marine engineer from Jamshedpur in Jharkhand is despondent on being forced to bear the burden of his name.
Please Wait while comments are loading...