దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

కన్నుమూసింది శశి కపూర్... ప్రగాఢ సంతాపమేమో శశి థరూర్‌కి! చిన్న పొరపాటుతో...

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింద'నే సామెత తెలిసిందే. పాపం.. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అలనాటి బాలీవుడ్ నటుడు
  శశి కపూర్ కన్ను మూసిన సంగతి తెలిసిందే.

  అయితే ఆయన అభిమానులు శశికపూర్‌కు నివాళులు అర్పించాల్సిందిపోయి.. శశి థరూర్ కు అర్పిస్తున్నారట. దీనంతటికీ కారణం.. ఓ అంగ్లమీడియా ఛానెల్ కథనం. శశి కపూర్ మరణిస్తే.. ఆ ఆంగ్ల మీడియా తన కథనంలో పొరపాటున శశిథరూర్ మరణించినట్లుగా రాసిందట.

  Shashi Kapoor is dead, I am alive: Shashi Tharoor clears death rumours

  ఇంకేముంది, తెల్లారేసరికి శశిథరూర్ కార్యాలయానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఫోన్లు మొదలయ్యాయి. దీంతో పాపం కార్యాలయ సిబ్బంది కూడా కంగారుపడిపోయారు. ఈ విషయాన్ని శశి థరూర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

  'ఉదయం నుంచి నా కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు. నేను చనిపోయానని వార్తలు వస్తున్నాయి. కానీ నాకు ఎలాంటి బాధ లేదు. కనీసం ఇంతటి బాధాకర సమయంలోనైనా నవ్వు తెప్పించినందుకు సంతోషంగా ఉంది..' అని థరూర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  అనంతరం శశి కపూర్‌కు ఆయన నివాళులు అర్పిస్తూ.. 'నాలోని ఓ భాగం కోల్పోయినట్లుగా ఉంది. గొప్ప నటుడు, అందగాడు, కాస్మోపాలిటన్‌. ఆయన పేరు నా పేరు ఒకేలా ఉండడంతో కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. శశి కపూర్‌ని నేను కూడా మిస్సవుతున్నాను..' అని పేర్కొన్నారు.

  నిజానికి శశి థరూర్‌ ఆదివారం కేరళలో పర్యటించి ఢిల్లీ చేరుకున్నారు. కేరళలో ఓఖి తుపాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో థరూర్‌ దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం థరూర్‌ గురించి ఆరాతీయడానికి చాలా మంది ఫోన్లు చేశారు.

  అసలే థరూర్ కాస్త నలతగా కనిపించడం, దానికి తోడు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ ఫోన్ కాల్స్ వెల్లువెత్తడంతో ఆయన కార్యాలయ సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత ఓ మీడియా ఛానెల్‌ చేసిన పొరపాటుతో ఈ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తెలిసి వారు వూపిరి పీల్చుకున్నారు.

  English summary
  Shashi Kapoor, who was suffering from a prolonged illness, passed away at the age of 79. But, it brought a lot of problems for Congress MP Shashi Tharoor as both the personalities have similar names (well, kind of). Shashi Tharoor, the Congress MP, himself tweeted about the loss of the great actor, Shashi Kapoor. But, the problem started when a leading media house tweeted that Tharoor has passed away. Amid the trolling and bashing, the problem grew so much that Tharoor's office started getting condolence calls too.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more