వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ చీర వివాదం: టీఆర్ఎస్ నాయకుడి భార్య గట్టి కౌంటర్, 'ఇప్పటికీ దొడ్డు బియ్యమే'

బతుకమ్మ చీరల దుమారం ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పెరు తెచ్చిపెట్టింది. చాలాచోట్ల మహిళలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను, ఎంపీ కవితను తిట్టిపోశారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: బతుకమ్మ చీరల దుమారం ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పెరు తెచ్చిపెట్టింది. చాలాచోట్ల మహిళలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను, ఎంపీ కవితను తిట్టిపోశారు. ఆ డ్యామేజీని పూడ్చుకోవడానికి గులాబీ గ్యాంగ్ ఎంత ప్రయత్నించినా.. జరగాల్సిందంతా అప్పటికే జరిగిపోయింది.

ఆ రచ్చ సోషల్ మీడియాలో అలా కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో వివాదం తెర పైకి వచ్చింది. ఓ ప్రజాప్రతినిధి భార్య బతుకమ్మ చీర అందుకోవడంపై రేగుతోన్న వివాదం అది. అయితే అటువైపు నుంచి కూడా విమర్శలకు గట్టి కౌంటర్ పడటంతో.. చాలామంది ఆమె మాటలతోను ఏకీభవిస్తున్నారు.

 strong counter form trs leader wife over batukamma saree issue

ఇంతకీ ఏంటా వివాదమంటే.. పౌర సరఫరాల చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఇటీవల బతుకమ్మ చీర అందుకున్నారు. సాధారణ మహిళల్లాగే ఆమె కూడా 'క్యూ' లైన్ లో నిలుచుని మరీ చీర తీసుకున్నారు. ఆమె సింప్లిసిటీని చాలామందిని మెచ్చుకున్నారు. ఫేస్ బుక్‌లో లైక్స్ కామెంట్స్‌తో అభినందించారు.

జ్యూస్ తాగుదామని తీసుకెళ్లి!: పాతబస్తీలో బాలుడి దారుణ హత్య..జ్యూస్ తాగుదామని తీసుకెళ్లి!: పాతబస్తీలో బాలుడి దారుణ హత్య..

అయితే ఇక్కడే ఓ పంచాయితీ కూడా మొదలైంది. పౌర సరఫరాల చైర్మన్ అంటే ఒక ప్రభుత్యోద్యోగి కిందే లెక్క. ఆ చైర్మన్ భార్య అయి ఉండి నువ్వు బతుకమ్మ చీర తీసుకోవడానికి ఎలా అర్హురాలివి?, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకే బతుకమ్మ చీర అన్న నిబంధన పెట్టినప్పుడు.. ఆ స్థాయి వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు ఉండటమేంటి? అన్న విమర్శలు వినిపించాయి.

అయితే దీనికి పెద్ది సుదర్శన్ భార్య పెద్ది స్వప్న గట్టి కౌంటరే ఇచ్చారు. 'పౌర సరఫరాల చైర్మన్ అయినప్పటికీ.. పెద్ది సుదర్శన్ ఈరోజు వరకు జీతం తీసుకోలేదు. ఎవరో ప్రచారం చేస్తున్నట్లు నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కూడా కాదు. పైగా నేను చీర తీసుకున్నది నల్లబెల్లిలో కాదు, మా తల్లిగారి ఊరు నాగారంలో.'

' నేను ఎస్సీ, ఊళ్లో జానెడు భూమి కూడా లేదు. మావాళ్లు ఇప్పటికీ తినేది దొడ్డు బియ్యమే. ఈ రేషన్ కార్డు 2009లో ఇచ్చింది. అందరికీ ఇచ్చినట్లే మా అమ్మకు కూడా బతుకమ్మ చీరల స్లిప్స్ ఇచ్చారు. వెళ్లి చీర తీసుకున్నాను. స్కాములతో కోట్లు సంపాదించుడు, దొంగ కర్ర వ్యాపారం, నాసిరకం టెండర్లు, జనాల జీవితాలతో ఆడుకునుడు మాకు తెలియదు. కేసీఆర్ ఇచ్చిన చీర నాకు విలువైనది.' అంటూ స్వప్న సమాధానం చెప్పారు.

కాగా, పెద్ది సుదర్శన్‌తో స్వప్న వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగింది. స్వప్న చెప్పినట్లు ఆ రేషన్ కార్డు 2009లో ఇచ్చింది కాబట్టి.. ఆమె పేరు కూడా అందులో నమోదై ఉంది. కాబట్టే.. బతుకమ్మ చీరల స్లిప్స్ ఆమెకు కూడా వచ్చాయని అనుకోవచ్చు. ఏదేమైనా స్వప్న ఇచ్చిన సమాధానంతో చాలామంది నోళ్లు మూతపడ్డాయని అంటున్నారు.

English summary
Civil Supplies Corporation Chairman Peddi Sudarshan Reddy's wife gave a smooth counter to netizens who are criticizing her for taking batukamma saree
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X