అరుణ్ జైట్లీ ఆరోగ్యం: జైరాం రమేష్ వివాదాస్పద వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రేపు ఆరోగ్యం బాగోదా? అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్ రాజ్యసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్‌పై చర్చను వాయిదా వేయడంతో ఆయన పైవిధంగా స్పందించారు.

ఆధార్‌పై బుధవారం సభలో చర్చ జరగనున్నట్లు రెండు రోజుల క్రితం రాజ్యసభ కార్యదర్శి నుంచి తమకు అధికారిక నోటీసులు వచ్చినట్లు జైరాం రమేశ్‌ తెలిపారు. అయితే ఆ చర్చను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ఉదయం తిరిగి నోటీసులు పంపారని పేర్కొన్నారు.

Will Jaitley fall ill tomorrow, asks Jairam Ramesh

వాయిదాకు కారణమేంటో విచారించామని, అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఉన్నారని, బుధవారం నాటి చర్చలో ఆయన పాల్గొనబోరని చెప్పినట్లు జైరాం తెలిపారు. అయితే జైట్లీకి రేపు కూడా ఆరోగ్యం బాగోదా అని రమేశ్‌ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై జైట్లీ స్పందించలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Will Finance Minister Arun Jaitley fall ill tomorrow? This was an intriguing question posed by senior Congress leader Jairam Ramesh in Rajya Sabha after a discussion on biometric identification Aadhaar, listed for Wednesday, was put off.
Please Wait while comments are loading...