వైఎస్ జగన్ కుటుంబంలో చిచ్చు: అలిగిన చిన్నాన్న

వైయస్ జగన్ కుటుంబంలో మరో సారి చిచ్చు పుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చిన్నాన్న అలక వహించినట్లు, ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుటుంబంలో మరోసారి రాజకీయ చిచ్చు పుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి అలక వహించినట్లు ప్రచారం సాగుతోంది. ఆయనను బుజ్జగించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి జగన్‌కు దూరమై కాంగ్రెసు పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. తాజాగా మనోహర్ రెడ్డి అసంతృప్తి ఎటు దారి తీస్తుందోననే ఆందోళనలో బంధువుల్లో నెలకొన్నట్లు చెబుతున్నారు.

YS Jagan's uncle keeps away from family

మనోహర్‌రెడ్డి సతీమణి ప్రమీల పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు. మనోహర్‌రెడ్డి కూడా కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. కొంతకాలంగా మనోహర్‌రెడ్డి వైఎస్ కుటుంబంలోని కొందరి వ్యవహార శైలి పట్ల మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. మున్సిపాలిటీలో వారి జోక్యం ఎక్కువగా ఉండటం, వైస్‌ చైర్మన్‌ పదవి వ్యవహారం కూడా వీరి మధ్య విభేదాలకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

దానికి తోడు ఇటీవల పులివెందుల మున్సిపల్‌ కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరిగాయి. తీవ్ర అసంతృప్తితో వేగిపోతున్న మనోహర్‌రెడ్డి పదవులకు కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. స్థానిక శాసనమండలి ఎన్నికలు జరగనున్న తరుణంలో మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉండడం చర్చనీయాంంగా మారింది. జగన్ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు. దీంతో మనోహర్ రెడ్డి అసంతృప్తి ఎటు దారి తీస్తుందోననే ఆందోళన కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+