2018 వింత ఇదే: టాయ్‌లెట్ బౌల్‌లో అందమైన పెదాలతో ‘ముద్దు’ ఎవరెట్టారు?

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదే ఓ అమ్మాయి లిప్‌స్టిక్ గుర్తులు ఓ టాయ్‌లెట్ బౌల్‌పై(లోపలి అంచున) ఉన్న ఫొటో. ఇప్పుడు ఈ ఫొటోపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

నెటిజన్లు చిత్ర విచిత్రంగా స్పందిస్తూ ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ అందరితో పంచుకుంటున్నారు. ఇది ఎక్కడ మొదలైందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అందమైన పెదాలతో..

టాయ్‌లెట్ ఎంత శుభ్రంగా ఉన్నా ఎవరైతే ఇలా ముద్దు పెట్టుకోలేరు. అయితే, మరి ఆ లిప్ స్టిక్ గుర్తులు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారాయి. తన అందమైన పెదాలతో మరీ అక్కడ ఎలా ముద్దు పెట్టి ఉంటుందో అర్థం కావడం లేదని నెటిజనర్లు తెగ తలలు గోక్కుంటున్నారు.

ఆ యువతి ఎవరు?

ఇంత సాహసం ఆ యువతి ఎలా చేసింది. అసలు ఆ యువతి ఎవరు? అంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఫొటోను 5వేల మందికిపైగా రీట్వీట్ చేయగా, 10వేలకు పైగా షేర్లు రావడం గమనార్హం.

2018 వింత ఇదే..

ఇది 2018లో జరిగిన వింత అంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. టాయ్‌లెట్: ఏక్ ప్రేమ కథా అంటూ మరో మహిళా నెటిజన్ సమాధానం ఇవ్వడం విశేషం. ఇలా కూడా చేస్తారా? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా జరిగి ఉండొచ్చంటున్న ఓ యువతి

ఓ ఇంటెలీజెంట్ యువతి మాత్రం ముద్దు పెట్టిన యువతి.. మొదట టిష్యూ పేపర్‌కు ముద్దు పెట్టి దాన్ని టాయ్‌లెట్ బౌల్‌లో పడేయడంతో ఆ గుర్తు అక్కడికి వచ్చిందని చెప్పడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
COMMENTSUser "clawedhumor" piqued Twitter's curiosity with an image of a toilet bowl. But the real shocker was inside the toilet. A pink lipstick mark imprinted inside the toilet bowl turned out to be the stuff of nightmares for Twitter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి