ఈ ఫుడ్స్ తింటే 32రకాల ప్రమాదకర వ్యాధులు; ప్రాణాంతకం..తాజా షాకింగ్ అధ్యయనం!!
మారుతున్న కాలంలో పరుగుల ప్రపంచంలో చాలామంది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. అయితే ఇది డేంజర్ అని, ఇటువంటి ఆహారాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, ఇంకా చెప్పాలంటే ప్రాణాలకే ప్రమాదం వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని వారు చెప్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు చేసిన కొత్త అధ్యయనంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాద కర వ్యాధులు వస్తాయని బ్రిటీష్ జర్నల్ లో వారు పేర్కొన్నారు.

వీటి వల్ల మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని, సీరియస్ గా తీసుకోవాలని వారు చెప్పారు. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు పెరిగి, అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదం అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల 50 శాతం పెరుగుతుందని వారు అంటున్నారు.
ప్యాక్ చేసిన ఫుడ్స్, ప్రోటీన్ బార్స్, ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఫుడ్స్ వంటివి తినడం చాలా ప్రమాదకరమని వారు చెప్తున్నారు. ఒక కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్స్ వల్లనే ప్రమాదకర వ్యాధులు ఎదురవుతున్నాయని వారు గుర్తించినట్టు తెలిపారు. క్యాన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యాలు, మెటబాలిజం కు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు.
అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కారణంగా డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందని తేల్చారు. అల్ట్రా ప్రాసెసింగ్ చేసిన ఫుడ్స్ లో విటమిన్లు, పీచు తక్కువగా ఉంటుందని, వాటిలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయని వారు తెలిపారు.
అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో స్నాక్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, రెడీ మీల్స్, ఫ్రిజీ డ్రింక్స్, షుగర్ సెరెల్స్ ఇలా చాలానే ఉన్నాయి. వీటి వలన ప్రమాదకర రోగాలు వస్తాయని విషయాన్ని గుర్తించి వీటికి దూరంగా ఉండడం మంచిది.












Click it and Unblock the Notifications