మద్యం అలవాటు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే, ఇలా ట్రై చేయండి..!!

మద్యం విషం కంటే తక్కువ కాదు. ఇది స్లో పాయిజన్ లాంటిది. ఒక్కసారి ఇది శరీరంలోకి వెళితే దీని ప్రభావం వారం రోజుల వరకూ ఉంటుంది. ఈ ఒక్క అలవాటు మీ ఆయుష్షును తినేస్తుంది. ఆర్థిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది. మీ శరీరాన్ని రోగాలకు నిలయం చేసే ఈ అలవాటును మానుకో వాల్సిన అవసరం ఉంది. మోతాదుకు మించి మద్యం సేవిస్తే.. అది ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణా లను దెబ్బ తీస్తుంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం పైన నిపుణులు కొన్ని సూచనలు చేస్తు న్నారు. క్రమేనా మద్యం నియంత్రణతో పాటుగా దూరం కావటం కోసం మేలు చేసే విధానాలను సూచిస్తున్నారు.

మద్యం సేవించేవారి వయసు 20 కావచ్చు. 80 కావచ్చు. ఎఫెక్ట్ మాత్రం ఒకేలాగే ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మద్యం కడుపులోకి వెళ్లినపుడు కాలేయం ఇతరత్రా శరీర విధుల ను ఆపేసి దీనినే జీర్ణం చేసేందు కు ప్రయత్నిస్తుంది. మోతాదుకు మించి మద్యం సేవిస్తే.. అది ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే.. నిపుణులు కొన్ని సూచనలు, చిట్కాలు అందిస్తున్నారు. మద్యం అలవాటు కంట్రోల్ కావాలంటే.. అది తాగేందుకు మీకు మీరే పరిమితి పెట్టుకోవాలి. రోజుకు పురుషులు 2 డ్రింక్స్ (60 ఎమ్‌ఎల్ స్పిరిట్, 650 ఎమ్‌ఎల్ బీర్), మహిళలు 1 డ్రింక్‌కు మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇలా పరిమితిగా మద్యం సేవిస్తే.. అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మద్యం సేవస్తున్నట్లయితే.. ప్రతి డ్రింక్ తర్వాత ఒక గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకొండి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు, ఆల్కహాల్ తీసుకోవడాన్ని కూడా తగ్గించవచ్చు. మాయో క్లినిక్ ప్రకారం ఇలా నీరు తాగడం కాలేయ ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.

alcohol-contain-ethanol-which-is-a-psychoactive-and-toxic-substance-with-dependence-producing-prope

క్రమేణా అలవాటు దూరం కావాలంటే

కాగా, ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే.. అది రక్తంలోకి వేగంగా శోషణం అవుతుంది. అందుకే ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం (గింజలు, గ్రిల్డ్ చికెన్) తీసుకుంటూ మద్యం సేవిస్తే.. అది శోషణ మందగింప జేస్తుందని.. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ (2022) చెబుతోంది. అదే విధంగా ఇక ప్రతి రోజు మద్యం సేవించకుండా.. వారంలో 2-3 రోజులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. ఇది శరీరాన్ని రికవరీ చేస్తుంది. అలానే మద్యం సేవించే అలవాటును తగ్గిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఆల్కహాల్ అబ్యూస్ ఈ విధానాన్ని సూచిస్తుంది. మద్యం తాగడానికి బదులుగా దాని స్థానంలో మాక్‌టెయిల్స్, హెర్బల్ టీ, పళ్ల రసాలు వంటివి తాగడం అలవాటు చేసుకొండి. ఇలాంటి అలవాటు.. సామాజిక సందర్భాల్లో మీపై ఒత్తిడిని తగ్గిస్తుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2023) వెల్లడించింది. మద్యం అలవాటు నియంత్రించుకోవాలంటే.. తాగే సమయాన్ని గమనించుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+