ఉపవాసాలు చేస్తున్నారా..? అయితే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..

ద‌స‌రా న‌వరాత్రుల సంద‌ర్భంగా చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ర‌కర‌కాల సాకుల‌తో ఉప‌వాసాలు చేసేవారుంటారు కొంద‌రు. ఉపవాసాలు చేస్తూ అదేదో గొప్ప విష‌య‌మ‌ని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఉపవాస వ‌ల‌న ఆరోగ్యానికి ముప్పు త‌ప్ప‌ద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఉప‌వాసం పేరిట లంఖ‌ణాలు చేయ‌డం అంత మంచిది కాదు. క‌డుపును ఖాళీగా ఉంచ‌డం, పూర్తిగా భ‌ర్తీ చేసేయ‌డం అంటే అప‌రిమితంగా తిన‌డం.

ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావు అంటున్నారు నిపుణులు.. వేళ‌కు ఆక‌లివేస్తుందంటే మంచి జీర్ణ‌శ‌క్తి ఉన్న‌ట్లే. అది మంచి ఆరోగ్య సూచ‌న‌. ఆ ఆరోగ్యాన్ని అలాగే కొన‌సాగించాలి. పండుగ‌లు, ప‌నుల‌ పేరుతో ఉపవాసాలు చేయ‌డం, ఆక‌లిని ప‌ట్టించుకోకుండా ఉండ‌డం, వేళ‌కు తిన‌క‌పోవ‌డం, వేళ మించాక తిన‌డం వంటివి చేస్తే చేజేతులారా స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే అని అంటున్నారు నిపుణులు.

Are you fasting? But health problems are inevitable..

న‌క‌న‌క‌లాడుతున్న‌ట్లు మ‌రీ ఆక‌లి పెరిగిపోయేవ‌ర‌కు ఆగ‌కూడ‌దు. అలాగ‌ని ఆక‌లి వేయ‌కుండానే ఏదీ ప‌డితే అది తిన‌కూడ‌దు. నిర్ణిత వేల‌ల్లో తింటూ ఉంటే అదే స‌మ‌యానికి ఆక‌లి కూడా వేస్తుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా ఒకే స‌మ‌యానికి తిన‌డం అన్ని విధాల మంచిది.

బేక‌రి ఐట‌మ్స్ తిన‌డం త‌గ్గించండి..

రెస్టారెంట్ల‌కు, పార్టీల‌కు, విందుల‌కు వెళ్లిన‌ప్పుడు వండి వడ్డించాల్సిన భోజ‌నం వ‌చ్చేలోపు రెడీమేడ్‌గా దొరికేవాటిని చాలామంది తినేస్తుంటారు. అలాంటి స‌మ‌యంలో అందుబాటులో ఉన్న బేక‌రి ఐట‌మ్స్‌తో కడుపు నింపేస్తుంటారు చాలామంది. అలా చేయ‌డం అరోగ్యానికి అస్స‌లు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాస్త ఆల‌స్యం అయినా స‌రే పోష‌కాల‌ను అందించే ఉడికించిన భోజ‌న ప‌దార్థాల‌నే తినాలి.

భోజ‌నం త‌ర్వాతే నీళ్లు తాగండి..

బ్రేక్‌ఫాస్ట్ భారీగా ఉండ‌వ‌చ్చు. మ‌ధ్యాహ్న భోజ‌నం సంప‌న్నులు తినే భోజ‌నంలా ఉండొచ్చు కానీ, రాత్రి తినేది మాత్రం సామాన్యులు తినేలా ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే రాత్రిళ్లు ప‌రిమితంగా తినాలి. భోజ‌నంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్‌గానీ, జ్యూస్ గానీ క‌లిపి తీసుకోకూడ‌దు. భోజ‌న స‌మ‌యంలో వీలైనంత‌గా నీళ్లు తాగ‌కూడ‌దు. భోజ‌నం పూర్త‌య్యాక నీళ్లు తాగాలి. మ‌ట‌న్ చికెన్ వంటివి మాంసాహారం తీసుకుంటే, వాటితో పాటు వీలైనంత‌గా ఉడికించిన కూర‌గాయ‌లు, పండ్లు తినాలి.

చిరుతిండ్ల‌కు దూరంగా ఉండండి..
ఆక‌లి తీరిన‌ట్లు అనిపించ‌గానే తిన‌డం ఆపేయాలి. భోజ‌నం రుచిగా ఉంది క‌దా అని మ‌రీ ఎక్కువ‌గా తిన‌కూడ‌దు. దాని వ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాలు ఎన్నో ఉంటాయి. పాప్‌కార్న్‌, స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి చిరుతిండ్ల‌కు ఎప్పుడూ దూరంగా ఉండాలి.

వృత్తిప‌రంగా ఎన్ని ఒత్తిడిలు ఎదుర‌యినా భోజ‌నం స‌మాయానికి తినాలి. రాత్రిళ్లు చాలాసేపు ఆగాల్సి వ‌స్తే మాత్రం రాత్రి భోజ‌నం స్కిప్ చేయ‌కుండా ఉండేలా చూసుకోవాలి. పొటాటో చిప్స్‌, ఫ్రైంచ్ ప్రైస్ వంటి స్థానంలో దోస‌ముక్క‌లు, క్యార‌ట్ ముక్క‌లు, టోమాటో ముక్క‌లు వంటి స‌లాడ్స్ తీసుకోవాలి. ఎవ‌రైనా ఏదైనా ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు అన్ని వేళ‌లా అన్ని ప‌దార్థాలు తిన‌కూడ‌దు. స్నేహపూర్వ‌క‌మైన ఒత్తిడితో అన్నీ తినేయ‌కుండా ఆరోగ్య‌క‌రం కాని వాటిని వ‌ద్ద‌ని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+