సరిగ్గా నిద్ర పోవటం లేదా? అయితే మీకు ఈ రోగాలు గ్యారెంటీ!
ప్రస్తుత సమాజంలో విపరీతమైన పని ఒత్తిడి, సరైన జీవన శైలి లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలతో జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులలో ఇన్సోమ్నియా కూడా ఒకటి. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం, సరిగ్గా నిద్ర పోలేక పోవడం. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్ర సరిగా పోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి.
సరిగ్గా నిద్ర పోకుంటే జరిగేదిదే
ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్ర పోవాలి. తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానం ప్రభావితం అవుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది .ప్రతి ఒక్కరు కచ్చితంగా తగినంత నాణ్యమైన నిద్రపోకపోతే శరీరం ఎక్కువ ఒత్తిడిని ప్రేరేపించే హార్మోన్లు అయిన కార్టిసాల్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.

హైబీపీ, గుండె జబ్బుల ప్రమాదం
ఇది హైబీపీకి కారణమవుతుంది. రక్తపోటు పెరగడం వల్ల అది గుండెపైన ఒత్తిడిని కలిగిస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రోక్ అవకాశాలను కల్పిస్తుంది. సరైన నిద్ర లేకపోతే ముఖంపైన నల్లటి మచ్చలు, గీతలు, ముడతలు వంటివి కనబడతాయి. ఇవి మీ అందాన్ని తగ్గిస్తాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తాయి. సరిగా నిద్ర పోకపోతే దాని ప్రభావం జుట్టు పైన కూడా పడుతుంది. జుట్టు బాగా రాలిపోతుంది.
నిద్ర లేకుంటే మెదడుపై ఒత్తిడి
ప్రతి మనిషి నిద్రపోయే సమయంలోనే మెదడు తనను తాను రిపేర్ చేసుకుని మళ్లీ మరుసటి రోజుకి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఎవరైతే సరిగ్గా నిద్రపోవడం లేదో వారికి ఈ ప్రాసెస్ దెబ్బతింటుంది. దాంతో మెదడు సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా చేసే పనిలో ప్రొడక్టివిటీ పోతుంది. నిద్రలేమి జీవక్రియను మందగించేలా చేస్తుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.
నిద్రలేమితో ఊబకాయం, మానసిక సమస్యలు
నిద్రలేమితో ఊబకాయ బాధితులుగా మారుతారు. నిద్రలేమి సమస్య వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుంది. నిద్రలేమి ఆందోళన, నిరాశ మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. జ్ఞాపకశక్తిని నాశనం చేస్తుంది. ఏకాగ్రత లేకుండా చేస్తుంది. కనుక సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలుసుకొని, నిద్రకు తగిన ప్రాధాన్యత నుంచి అందుకు తగిన విధంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. వీటితో చెక్, ఇక హాయిగా..!! -
హోటల్ స్టైల్ "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
సమ్మర్ స్పెషల్ "పెరుగు చట్నీ" ఎలా చేయాలంటే..? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications