బీరకాయ శనగపప్పు మసాలా కూర.. ఇలా వండితే అదిరిపోయే రుచి!

బీరకాయ ముక్కల తియ్యదనం, శనగపప్పు కమ్మదనం, ఘాటైన మసాలా గ్రేవీ.. ఈ మూడింటి కలయికతో చేసే "బీరకాయ శనగపప్పు మసాలా కూర" అన్నం, చపాతీ లేదా రోటీల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ చేసే పప్పు కూరలా కాకుండా, రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ రుచితో దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

బీరకాయలు: అరకిలో (ముక్కలు)

పచ్చి శనగపప్పు: అర కప్పు(30 నిమిషాలు నానబెట్టుకోవాలి)

ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)

టమోటాలు: 2(సన్నని ముక్కలు)

పచ్చిమిర్చి: 2(నిలువుగా చీల్చినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

కారం: 1.5 టీస్పూన్

పసుపు: అర టీస్పూన్

ధనియాల పొడి: 1టీస్పూన్

గరం మసాలా పొడి: అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 3 టేబుల్ స్పూన్లు

పోపు దినుసులు: ఒక స్పూన్

కొత్తిమీర: కొద్దిగా

beerakaya senagapappu masala kura make in this process for best taste good for roti and rice

తయారీ విధానం:

స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. అ అందులో నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసి బాగా కలిపి మగ్గించండి.

కూర ఇలా వండితే బాగుంటుంది

ఆపై అందులో టమోటా ముక్కలు వేసి నూనె పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వాలి. శనగపప్పు, టమోటా మగ్గాక పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి, మూత పెట్టి ఐదు నిమిషాలు చిన్న మంటపై మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి ఉడికించాలి.

తమలపాకులతో ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదుర్స్
తమలపాకులతో ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదుర్స్

రుచికరమైన బీరకాయ శనగపప్పు మసాలా కూర ఇలా వండుకోండి

కూర గ్రేవీలా రావడం కోసం అర కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి మీడియం మంట మీద 8 నుండి 10 నిమిషాలు ఉడికించాలి. బీరకాయ ముక్కలు మెత్తబడి, పప్పు కూడా ఉడికి గ్రేవీ చిక్కబడే వరకు ఉంచాలి. ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు మసాలా కూర సిద్ధం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+